చిరు సినిమా.. పూరి భయం!

Sat Sep 24 2022 12:09:35 GMT+0530 (India Standard Time)

Chiru movie.. Fear of Puri!

ఎంత పెద్ద స్టార్ దర్శకుడైన కూడా అతనిలో ఎంతో కొంత యాక్టింగ్ స్కిల్స్ ఉండకుండా ఉండవు. ఒక సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లే దర్శకులు యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో కొన్ని సినిమాలలో చాలా క్లారిటీగా అర్థమైంది. ఇక బలమైన డైలాగ్స్ రాసే పూరి జగన్నాథ్ నటిస్తే కూడా అద్భుతం ఉంటుందని ఏ మాయ చేసావే సినిమాతో క్లారిటీ వచ్చింది. ఇక పూరి జగన్నాథ్ ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాల్లో నటించారు.కానీ పెద్దగా డైలాగ్స్ ఉన్న పాత్రలో మాత్రం కనిపించలేదు. ఇక ఫైనల్ గా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు.ఒక ముఖ్యమంత్రి మరణం తర్వాత రాజకీయ నాయకులను వారి స్వార్థ ఉద్దేశాలు అలాగే ఎత్తుగడల గురించి ప్రశ్నించే డాషింగ్ జర్నలిస్ట్‌గా అతను కనిపించనున్నాడు.

దర్శకుడు పూరి జగన్నాధ్‌ను ఈ పాత్రలో నటించమని ఒప్పించడానికి కొంత సమయం పట్టిందని అతను ఈ పాత్రను చేయడానికి మొదట్లో వెనుకడుగు వేశాడని మెగాస్టార్ వెల్లడించారు. అయితే తన జర్నలిస్ట్ పాత్రలో ఉన్న రెండు డైలాగులకు పూరి జగన్ కంటే ఎవరూ న్యాయం చేయరని చిరు భావించినట్లు కూడా చెప్పారు. ఏ మాయ చేసావే సినిమాలో పూరి చేసిన చిన్న పాత్ర లాగా తెరపై కనిపించినప్పుడల్లా అతను తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

ఇక ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ లో పూరి మంచి క్యారెక్టర్ లో అలరించనున్నాడు. అయితే గతంలో చాలాసార్లు పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాడు ముఖ్యంగా పాలిటిక్స్ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు పూరి కొన్ని కథలు కూడా చెప్పాడట.

కానీ వేరే వాళ్ళ మాటలు విని మెగాస్టార్ తనతో చేయలేదు అని కూడా పూరి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఇప్పుడు ఆయన సినిమాలోని ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తూ ఉండడం విశేషం. మరి పూరి దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా భవిష్యత్తులో ఉంటుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.