Begin typing your search above and press return to search.

'ఆచార్య' సెట్ లో అడుగుపెట్టిన చిరు - చిరుత..!

By:  Tupaki Desk   |   16 Sep 2021 2:30 AM GMT
ఆచార్య సెట్ లో అడుగుపెట్టిన చిరు - చిరుత..!
X
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. చిరంజీవి 'గాడ్ ఫాదర్' షూటింగ్ స్టార్ట్ చేయడం.. చరణ్ RRR చిత్రీకరణలో బిజీగా ఉండటంతో రెండు పాటలు పెండింగ్ లో ఉండిపోయాయి. అయితే తాజాగా 'ఆచార్య' షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకమైన సెట్ లో ప్రస్తుతం 'ఆచార్య' షూటింగ్ జరుగుతోంది. ఇందులో చిరంజీవి - రామ్ చరణ్ లపై ఒక స్పెషల్ సాంగ్ ని షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఒక వారం రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ మెగా అభిమానులకు ఒక ట్రీట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక మరో పాటను వచ్చే వారం నుంచి చరణ్ - హీరోయిన్ పూజా హెగ్డే లపై షూట్ చేయనున్నారు.

ఈ నెలాఖరులోగా 'ఆచార్య' షూటింగ్ పార్ట్ కంప్లీట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు. చిరంజీవి - రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి సినిమా కావడంతో 'ఆచార్య' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.