Begin typing your search above and press return to search.

#చిరు.. ఈ సందేహానికి క్లారిటీ ఏమిటో?

By:  Tupaki Desk   |   4 Dec 2020 4:42 AM GMT
#చిరు.. ఈ సందేహానికి క్లారిటీ ఏమిటో?
X
లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌స్తానంటూ ర‌జ‌నీ డైలాగ్ త‌ర‌హాలో మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలో లేట్ ఎంట్రీ ఇచ్చి సంద‌డి చేశారు. 822.7కె ఫాలోవ‌ర్స్‌ని అతి త‌క్కువ స‌మ‌యంలోనే సొంతం చేసుకుని వ‌రుస ట్వీట్ ‌ల‌తో స‌రికొత్త ట్రెండ్ ని సెట్ చేశారు. త‌న వార‌సులు.. స్టార్ హీరోల‌కు మించి సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ ప్రతి చిన్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ అభిమానుల్ని నెటిజ‌నులను ఎంట‌ర్ టైన్ చేశారు.

చిరు స్పీడుకి ఆయ‌న ఫ్యామిలీ హీరోల‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇంటి ప‌ని ఛాలెంజ్ లోనూ ముందుండి త‌న స‌త్తా ఏంటో చూపించిన చిరు వంట కూడా చేసి ఆ వీడియోని అభిమానుల‌తో పంచుకున్నారు. ఇలా స‌ర‌దా స‌ర‌దాగా సాగిన ఆయ‌న ట్విట్ట‌ర్ ప్ర‌యాణం గ‌త కొన్ని రోజులుగా ఎందుక‌నో ఆగిపోయింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని.. ఆ త‌రువాత కిట్ స‌మ‌స్య వ‌ల్ల త‌ప్పిదం జ‌రిగింద‌ని వెల్ల‌డించిన చిరు ఆ త‌రువాత దీపావ‌ళి సంద‌ర్భంగా క‌ళాత‌పస్వి కె. విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్లి దంప‌తుల‌తో గ‌డిపారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

సామ్ జామ్ కోసం స‌మంత‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన చిరు ఆ త‌రువాత నుంచి ఆయ‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ మూగ‌బోయింది. ఇంత‌కీ ఏం జ‌రిగింది? గ‌్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన చిరు ఆ ఫొటోని కూడా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది?. ‌ఇప్పుడున్న సినారియాలో అస‌లు ఆయ‌న రాజ‌కీయాల్ని ట‌చ్ చేయ‌కుండా కేవ‌లం సినిమాల‌పైనే దృష్టి సారిస్తున్నాన‌ని సిగ్న‌ల్ ఇచ్చారా? ఆచార్య బిజీ వ‌ల్ల‌నే ఆయన లైట్ తీస్కున్నారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.