Begin typing your search above and press return to search.

చిరు.. మహేష్‌ లకు అవార్డ్స్‌

By:  Tupaki Desk   |   25 Jan 2020 5:34 AM GMT
చిరు.. మహేష్‌ లకు అవార్డ్స్‌
X
ప్రతి సంవత్సరం జీ తెలుగు ఛానెల్‌ జీ సినీ అవార్డులను అందిస్తుంది. అలాగే ఈ ఏడాదికి గాను ఇటీవలే ఈ అవార్డు వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు మరియు వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇక నేడు మరియు రేపు ఆ అవార్డులకు సంబంధించిన కార్యక్రమంను జీ తెలుగులో ప్రసారం చేయబోతున్నారు. ఈ సమయంలో అవార్డులు దక్కించుకున్న వారి వివరాలు బయటకు వచ్చాయి.

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్‌ గారికి లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డును చిరంజీవి చేతుల మీదుగా అందించారు. ఇక సైరా చిత్రానికి గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇక ఓ బేబీ చిత్రంలో మంచి నటన కనబర్చి ఆకట్టుకున్న సమంతకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఇక మహేష్‌ బాబుకు సోషల్‌ మీడియాలో స్టార్‌ అంటూ ట్విట్టర్‌ స్టార్‌ అవార్డును జీ వారు అందించారు.

ఇదే వేడుకలో చిరంజీవి పెద్ద కూతురు కూడా సైరా చిత్రానికి గాను బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా అవార్డు ను అందుకున్నారు. ఈ వేడుకలో ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ డాన్స్‌ చేసి ఆ తర్వాత ఇచ్చిన స్పీచ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కి కన్నీరు పెట్టించింది. చిరంజీవి గారి అబ్బాయి కేవలం చరణ్‌ మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఆయన స్ఫూర్తి గా వచ్చిన మేము అంతా కూడా ఆయన అబ్బాయిలమే అంటూ కార్తికేయ అనడం తో చిరంజీవి కళ్లు చెమర్చాయి. మొత్తానికి ప్రదీప్‌.. రవి.. శ్యామల యాంకరింగ్‌ మెగాస్టార్‌ ఇంకా ప్రముఖుల హాజరు తో కార్యక్రమం చాలా సందడిగా సాగింది.