#చిరు152: మహేష్ క్యామియో చేస్తున్నాడా లేదా?

Wed Feb 26 2020 12:30:16 GMT+0530 (IST)

Chiru-Mahesh-Koratala: Are They Just Rumours?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో #చిరు152 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని మొదట్లో అన్నారు.  అయితే 'RRR' పూర్తయ్యేవరకూ చరణ్ మరో సినిమాలో నటించే అవకాశం లేదట.  నిజానికి ఈ మార్చికే 'RRR' షూటింగ్ పూర్తవుతుందని.. వెంటనే #చిరు152 లో నటిస్తారని అనుకున్నారు కానీ షూటింగ్ డిలే కావడంతో చరణ్ ఈ సినిమాలో నటించడంపై సందిగ్ధత నెలకొంది.  దీంతో ఈ పాత్రలో నటిస్తారంటూ పలువురు ఇతర టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మహేష్ బాబు పేరు కూడా ఉంది.ఈ సినిమాలో మహేష్ క్యామియో ఫిక్స్ అయిందని కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి.  కానీ అది నిజం కాదని సమాచారం. మహేష్ కు ఈ సినిమాలో క్యామియో చేసే ఆసక్తి ఉందా లేదా అని కొరటాల శివ క్యాజువల్ గా కనుక్కున్నారట. అంతకు మించి ఇంకేమీ లేదని..  ఈ సినిమాలో క్యామియో పాత్రను రామ్ చరణ్ చేస్తారని.. ఒకవేళ చరణ్ కు కుదరనిపక్షంలో ఆ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తారని సమాచారం. ఈ సినిమాలో ఎవరు ప్రత్యేక పాత్రలో నటిస్తారనే విషయంలో త్వరలోనే కొరటాల శివ క్లారిటీ ఇస్తారట.  ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో స్టార్ హీరోలలో ఎవరు నటించినా అది ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.  మెగాస్టార్ సినిమాలో మరో స్టార్ హీరో నటించడం ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతినిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

కొరటాల శివ టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు. ఆయన మొదటిసారిగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా కొరటాల ఒక సామాజిక కథాంశంతో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.