Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఇలా ట్వీట్స్ చేస్తున్నాడేంటి..!

By:  Tupaki Desk   |   26 March 2020 2:00 PM GMT
మెగాస్టార్ ఇలా ట్వీట్స్ చేస్తున్నాడేంటి..!
X
మనిషి దైనందిన జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. టీవీలో వచ్చే వార్తల కంటే సోషల్ మీడియాలోనే వార్తలు చాలా ఫాస్ట్ గా రావడంతో చాలా వరకు మనుషులు సోషల్ మీడియాకి అలవాటు పడిపోయారు. అంతేకాకుండా వాస్తవ ప్రపంచంలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రజలు గడుపుతున్నారు. ఇతర సెలబ్రిటీలు అయితే ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియాలో ఎంటర్ అవడం పెద్ద సమస్య కాదు కానీ అక్కడ ఎలా మెలగాలో అందరికీ తెలీదు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ట్విట్టర్, పేస్ బుక్ వాడకంలో ఇబ్బందులు పడుతుంటారు.

ఇక మెగాస్టార్ విషయానికొస్తే తనకు వెల్కమ్ చెప్పిన సెలెబ్రిటీలు అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు చెప్పడమే కాకుండా వాళ్ళందరి గురించి ఒక మంచి మాట కూడా జత చేసి చెబుతున్నారు. ఇది ఆల్రెడీ ఫాన్స్ కి నచ్చడం లేదు. ఇన్స్టాగ్రామ్ తో పాటు ట్విట్టర్ లో కూడా ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి స్టేజ్ పై మైక్ పట్టుకుంటే ఎలా సుదీర్ఘంగా మాట్లాడతారో ట్విట్టర్ లో కూడా అదే ధోరణి కనబరుస్తున్నారు. దీనిని ఇంటర్నెట్ పరిభాషలో స్పామింగ్ అంటారు. చిరంజీవి ఇలాగే కొనసాగిస్తే మాత్రం ఫాలో అయిన వాళ్ళు కూడా ఆయన్ని మ్యూట్ లో పెట్టేస్తారు. ట్విట్టర్ అంటేనే క్లుప్తంగా ఉండాలనేది ఉద్దేశం. అది మెగాస్టార్ ఎంత త్వరగా తెలుసుకుని అన్ని తక్కువ ట్వీట్లు తనదైన శైలిలో పెడితే అంత మంచిది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మన అభిప్రాయాలను అందరూ గౌరవించాలని లేదు. ఒక్కొక్కసారి మనం పెట్టే పోస్ట్ నచ్చని వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ తెలుసుకొని సోషల్ మీడియా లో మెలగాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.