'గారు' అని పిలపేది? 'మామ' అనవా బన్నీ?!

Thu Jan 27 2022 08:26:57 GMT+0530 (IST)

Chiru Fans Fire On Allu Arjun

సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ పెద్ద డిబేట్ గా మారుతోంది. ఎక్కడ ఏ చిన్న తప్పిదం జరిగినా దానిని భూతద్ధంలో పెట్టి చూడడం పరిపాటిగా మారింది. ఇకపోతే ఫలానా హీరోల మధ్య విభేధాలున్నాయన్న ప్రచారం కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. మీడియా కంటే ముందే సాధారణ ప్రజల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.రిపబ్లిక్ డే జెండా వందనం వేళ ఒక అనూహ్య పరిణామం. ఆరోజు అందరిలానే జెండావందనం చేసిన మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వీయనిర్భంధంలో ఉన్నానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాల్లో సాటి సెలబ్రిటీ ప్రపంచం నుంచి ప్రార్థనలు వెల్లువెత్తాయి. చిరంజీవి గారు తొందరగా కోలుకోవాలని సినీపరిశ్రమ ప్రముఖులు ఆకాంక్షించారు.

అందరితో పాటు బన్ని కూడా ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ కూడా చిరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ``మీరు త్వరగా కోలుకోవాలని నా ప్రార్థనలు . లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిసి సంతోషిస్తున్నాను. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను`` అని వ్యాఖ్యానించారు. అతని ఈ సింపుల్ సమాధానం చాలా మంది అభిమానులకు సాధారణ జనులకు అంతగా రుచించలేదు. బన్నీ ట్వీట్ లో ఎక్కడా `గారు` అన్న ప్రస్థావన లేదు. మవయ్య అని కూడా పిలవలేదు. ఇది మెగా ఫ్యాన్స్ కి అస్సలు రుచించలేదు. దీనిపై ట్రోలింగ్ సాగుతోంది.

కొందరైతే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకే ఈ హెడ్ వెయిట్ అంటూ కూడా విమర్శించేస్తున్నారు. చంద్ర బాబు- లోకేష్- ఎన్టీఆర్ లాంటి ప్రముఖులే సార్ అని పిలిచారు. కానీ బన్ని అలా పిలవలేదని ఫ్యాన్స్ ఫైరయ్యారు. సినీప్రముఖులంతా తమ ట్వీట్లలో గారు అని ప్రస్థావించారు. అంతేకాదు ఒక ఈవెంట్ లో చిరంజీవికి గౌరవం ఇవ్వాలని బన్నీ డిమాండ్ చేసిన పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. బన్నీ స్వయంగా సార్ లేదా గారు అంటూ గౌరవించాలని ప్రత్యేకంగా చెప్పినప్పుడు అతను దానిని ఎందుకు మరచిపోయాడనేది ఇప్పుడు చర్చగా మారింది. ఇప్పటికే బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతోందన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. తాజా ట్వీట్ లో గారు అని పిలవకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.

ఇకపోతే బన్నీ ఉద్ధేశాన్ని అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారా? అతడు చాలా మామూలుగానే అలా యథాలాపంగా వ్యాఖ్యను రాసేశారా? అంటూ ఒక సెక్షన్ ఆరాలు తీస్తోంది. ఏదేమైనా కానీ ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో ఫ్యాన్ వార్ మాత్రం ఆగేట్టు లేదు.