Begin typing your search above and press return to search.

శ‌క్తి - కంత్రి - షాడో ఎందుకు గుర్తుకు రాలేదంటే?

By:  Tupaki Desk   |   25 Sep 2020 8:30 AM GMT
శ‌క్తి - కంత్రి - షాడో ఎందుకు గుర్తుకు రాలేదంటే?
X
`ఆచార్య` త‌ర్వాత నెక్ట్స్ ఏంటి? అంటే చిరుకి క్ష‌ణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్ ఉంది. `లూసిఫ‌ర్`.. `వేదాళం` రీమేక్ ల కోసం మేకోవ‌ర్ చేయాల్సి ఉంటుంది. ఇటీవ‌లే వేదాళం కోసం గుండు లుక్ లో క‌నిపించి చిరు షాకిచ్చారు. ఇక ఈ మూవీకి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి విధిత‌మే. అనూహ్యంగా లూసీఫీర్ రీమేక్ ని వెన‌క్కి పంపి వేదాళం రీమేక్ ని చిరు 154 గా మ‌ల‌చ‌డం వెన‌క చాలానే జిమ్మిక్ ఉంద‌ని తెలుస్తోంది.

`శ‌క్తి- కంత్రి- షాడో` ఇవ‌న్నీ అసాధార‌ణ డిజాస్ట‌ర్లుగా నిలిచినా చిరు ఈ ఆఫ‌ర్ ఎలా ఇచ్చారు? అంటూ ఒక‌టే గుస‌గుస టాలీవుడ్ ని వేడెక్కించింది. ఏడెనిమిదేళ్ల‌కు కూడా ఆయ‌న‌కు ఆఫ‌ర్ లేనే లేదు. అంతకు ముందు `బిల్లా` త‌ప్ప చెప్పుకోద‌గ్గ సినిమాలే లేవు. ఇక రీమేక్ చేస్తే మెహ‌ర్ బాగానే చేస్తాడ‌న్న టాక్ ఒక‌టి అప్ప‌ట్లో ఉండేది. కానీ ఇటీవ‌ల సినిమాలే చేయ‌లేదు ఆయ‌న‌. అయితే అలాంటి ప్రొఫైల్ చూసి కూడా చిరు ఈ రీమేక్ కి ఎలా అవకాశం ఇచ్చారు? అంటే ఆస‌క్తిక‌ర విష‌య‌మే తెలిసింది.

మెహ‌ర్ కి చిరు కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది. పైగా మ‌హ‌మ్మారీ కాలంలో సీసీసీ సేవ‌ల‌కు మెహ‌ర్ శ్ర‌మించిన తీరు నిబ‌ద్ధ‌త మెగాస్టార్ కి విప‌రీతంగా న‌చ్చేశాయ‌ట‌. ఏడెనిమిది నెల‌ల కాలంలో ఈ క్రైసిస్ ఆద్యంతం మెహ‌ర్ ఎంతో ప్ర‌ణాళికా బ‌ద్ధంగా సీసీసీ స‌రుకులు పంపిణీ అయ్యేందుకు త‌న‌దైన శైలిలో శ్ర‌మించి ప్రాజెక్ట్ ని స‌క్సెస్ చేయ‌డంతో సాఫ్ట్ కార్న‌ర్ పొంద‌గ‌లిగారు. సేమ్ టైమ్ సీసీసీకి ముందు నుంచి అత‌డు చిరుని స్క్రిప్టు ప‌నితో ఎప్రోచ్ అవుతున్నారట‌. ఓవైపు సీసీసీ ప‌నులు చ‌క్క‌బెడుతూనే స్క్రిప్టును షేప‌ప్ చేసి ఒప్పించ‌డంలో మెహ‌ర్ స‌ఫ‌ల‌మ‌య్యార‌ట‌. చివ‌రికి ఆయ‌న శ్ర‌మ డెడికేష‌న్ ఫ‌లించి అవ‌కాశం అందుకున్నారు.