Begin typing your search above and press return to search.

'చిరు బిడియం' లిరికల్ వీడియో: ఆకట్టుకుంటున్న 'చరిత కామాక్షి' సాంగ్..!

By:  Tupaki Desk   |   20 Jan 2022 10:06 AM GMT
చిరు బిడియం లిరికల్ వీడియో: ఆకట్టుకుంటున్న చరిత కామాక్షి సాంగ్..!
X
స్త్రీలంక చందు సాయి దర్శకత్వంలో నవీన్ బేతిగంటి - దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''చరిత కామాక్షి''. ఇందులో టైటిల్ రోల్ చరిత కామాక్షి పాత్రలో దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అలానే ఇప్పటికే విడుదలైన 'చరిత కామాక్షి' ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'చిరు బిడియం' అనే పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'చిరు బిడియం.. మదిలో మోమాటం.. చిన్న భయం.. ఎదలో ఆరాటం.. తొందరగా.. తగదని నెమ్మదిగా..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది.

కొత్తగా పెళ్ళైన హీరో హీరోయిన్ల మధ్య మధురమైన క్షణాలను 'చిరు బిడియం' పాటలో చూడొచ్చు. దివ్య శ్రీపాద చీరకట్టులో చక్కటి చిరునవ్వుతో ఎంతో అందంగా.. చూడగానే గౌరవం ఉట్టిపడే గృహిణిగా కనిపిస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అబూ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా.. గాయని చిన్మయి శ్రీపాద వినసొంపుగా ఆలపించారు. మనోహర్ పాలిశెట్టి 'చిరు బిడియం' సాంగ్ కు సాహిత్యం అందించారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

కాగా, ''చరిత కామాక్షి'' చిత్రాన్ని నవీన్ బేతిగంటి - దివ్య సమర్పణలో ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజనీ రెడ్డి నిర్మిస్తున్నారు. శివ ఎమ్ఎస్కే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రాకీ వనమాలి సినిమాటోగ్రఫీ అందించగా.. కోడాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

యూత్ ఆడియెన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా 'చరిత కామాక్షి' సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.