Begin typing your search above and press return to search.

మరోసారి వెనక్కు వెళ్లిన చిరు భోళా శంకర్‌

By:  Tupaki Desk   |   24 Oct 2021 5:34 AM GMT
మరోసారి వెనక్కు వెళ్లిన చిరు భోళా శంకర్‌
X
మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ మూడు సినిమాలను చేయడం కోసం అంటూ తమిళ సినిమా వేదాళం.. మలయాళం సినిమా లూసీఫర్‌ రీమేక్ లతో పాటు బాబీ దర్శకత్వంలో ఒక డైరెక్ట్‌ సినిమాను కమిట్‌ అయిన విషయం తెల్సిందే. కరోనా కారణంగా ఈ మూడు సినిమాలు చాలా చాలా ఆలస్యం అవుతున్నాయి. ఆచార్య సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆచార్య సినిమా విడుదల కాబోతున్నట్లుగా ఇటీవేల అధికారికంగా ప్రకటించారు. ఆచార్య సినిమా తర్వాత మలయాళం మూవీ లూసీఫర్ రీమేక్ అయిన గాడ్‌ ఫాదర్‌ తో చిరంజీవి రావబోతున్నట్లుగా ఇప్పటికే తేలిపోయింది. గాడ్‌ ఫాదర్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే సగం వరకు పూర్తి అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్‌ తర్వాత భోళా శంకర్ సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా ఇప్పుడు ప్లాన్‌ చేంజ్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గాడ్‌ ఫాదర్ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే బాబీ దర్శకత్వం లో సినిమాను చిరంజీవి చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. దాంతో హడావుడిగా బాబీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నిమగ్నమయ్యాడు. వచ్చే సమ్మర్ కు ముందే బాబీ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఆ తర్వాత భోళా శంకర్ మూవీ ని చిరు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. భోళా శంకర్ సినిమా షూటింగ్ విషయంలో మొదటి నుండి వెనక్క వెళ్లడం జరుగుతోంది. చిరంజీవి భోళా శంకర్ సినిమా షూటింగ్‌ ఆచార్య షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే మొదలు అవ్వాల్సి ఉంది. కాని అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

తమిళ సూపర్ హిట్‌ వేదాళం కు రీమేక్ గా రూపొందుతున్న సినిమానే భోళా శంకర్. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం లో రూపొందబోతున్న ఈ సినిమా లో చిరంజీవికి చెల్లి పాత్రను కీర్తి సురేష్‌ చేయడం ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఇప్పటికే చిరు కీర్తి సురేష్ ల పోస్టర్ విడుదల అయ్యింది. సినిమాను గాడ్ ఫాదర్ కంటే ముందుగానే షూట్‌ కు తీసుకు వెళ్లాలని అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల పక్కకు పెట్టారు. ఇప్పుడు బాబీ సినిమా తర్వాత అంటున్నారు. స్క్రిప్ట్‌ ఇష్యూ ఏమైనా ఉందా లేదంటే మెల్లగా భోళా శంకర్ ను చేయాలనే ఉద్దేశ్యమా అనేది మెగా ఫ్యాన్స్ కు క్లారిటీ లేకుండా ఉంది. వచ్చే ఏడాది చివరి వరకు అయినా భోళా శంకర్ సినిమా పట్టాలెక్కేనా అనేది చూడాలి.