బాలయ్య మెగానుబంధం... ?

Thu Oct 14 2021 23:00:01 GMT+0530 (IST)

Chiranjeevi vs Balayya ...?

దాదాపుగా ఒకే సమయంలో సినీ ఇండస్ట్రీకి  బాలయ్య చిరంజీవి వచ్చారు. ఇద్దరూ స్టార్ ఇమేజ్ సాధించింది కూడా ఒకేసారి. చిరంజీవికి ఖైదీ మూవీ ద్వారా స్టార్ స్టాటస్ వస్తే బాలయ్యకు మంగమ్మగారి మనవడు మూవీతో  సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ తరువాత ఎనభై దశకం తొంబై దశకం అంతా కూడా ఈ ఇద్దరు మధ్యనే విపరీతమైన పోటీ నడచింది. ఇద్దరూ పక్కా మాస్ హీరోలు కావడంతో ఫ్యాన్స్ కూడా అటూ ఇటూ మోహరించి సినీ సమరాలకు కాలు దువ్వేవారు. ఈ ఇద్దరి సినిమాలు ఒకే డేట్ లో రిలీజ్ అయితే ఆ రచ్చ వేరుగా ఉండేది. ఇక సంక్రాంతి వేళ కోడి పందేల మాదిరిగా ఈ ఇద్దరి హీరోల సినిమాలు పోటా పోటీగా వచ్చి సందడి చేసేవి.ఇవన్నీ పక్కన పెడితే సినిమా రంగంలో బాలయ్య చిరంజీవి మంచి మిత్రులుగా ఉంటున్నా పోటీ అన్నది మాత్రం కచ్చితంగా ఉంది. కనిపిస్తే ఇద్దరూ బాగా మాట్లాడుతుంటారు. అలాగే సినిమాల విషయంలో మాత్రం ఢీ అంటే ఢీ అంటారు. బాలయ్య అఖండ చిరంజీవి ఆచార్య మూవీస్ నిజానికి దసరాకు పోటీ పడాలి కానీ ఆ చాన్స్ తప్పిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య చిరంజీవిల మధ్య అనుబంధం బహు గట్టిది. ఆ సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. బాలయ్య ఏమన్నా చిరంజీవి లైట్  తీసుకుంటారు. ఇక చిరంజీవి ఎదురుపడితే నవ్వుతూ ముచ్చట్లు పెడుతూ బాలయ్య సందడి చేస్తారు. బాలయ్య వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణికి చిరంజీవి ముఖ్య అథిధిగా హాజరయ్యారు.

ఇక బాలయ్య డిజిటల్ ఫ్లాట్ ఫారం మీద కూడా ఇపుదు సందడి చేయబోతున్నారు. ఆయన తొలిసారిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కి చెందిన అహా ఓటీటీ ద్వారా అన్ స్టాబబుల్ పేరుతో అద్భుతమైన కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతున్నారు. బాలయ్య ఫస్ట్ షోకి గెస్టులుగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హాజరవుతారు అని తెలుస్తోంది. అదే కనుక జరిగితే అంతకు మించిన పండుగ ఉండదు అటు మెగా ఫ్యాన్స్ ఇటు బాలయ్య ఫ్యాన్స్ కి హుషారే హుషార్ గా ఉంటుంది. మొత్తానికి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ ఇలా డిజిటల్ ఫ్లాట్ ఫారం మీద కలుసుకోవడం ఫ్యాన్స్ కి పూనకాలే తెప్పిస్తుంది అనడంలో సందేహమే లేదు.