Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను కీర్తిస్తూ చిరంజీవి ట్వీట్

By:  Tupaki Desk   |   23 May 2020 3:30 AM GMT
కేసీఆర్ ను కీర్తిస్తూ చిరంజీవి ట్వీట్
X
స్తంభించిపోయిన తెలుగు సినిమాను పట్టాలెక్కించడానికి సినీ పెద్దలంతా చేసిన ప్రయత్నం సానుకూల ఫలితాలను ఇచ్చింది. సినిమా పరిశ్రమకు నిజంగా సినిమా కష్టాలొచ్చాయని... వాటిని సానుకూల దృక్పథంతో పరిష్కరించమని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన చిరంజీవి తదితర సినీ పెద్దలకు కేసీఆర్ విడతల వారీ నిబంధనలతో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్జతలు తెలిపారు.

"తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. మా సమస్యలను సామరస్యంగా చర్చించి, మాలో భరోసా నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినిమా, టీవీ, డిజిటల్ మీడియాలన్నిటి తరఫున హృదయపూర్వక కృతజ్జతలు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

పలువురు సినిమా పెద్దలు ముఖ్యమంత్రి తో సమావేశమైన సందర్భంగా వివరంగా వారి సమస్యలను విన్న కేసీఆర్ వారి పట్ల చూపిన ఆప్యాయత, శ్రద్ధ సినిమా పెద్దలను ముగ్దులను చేసింది. ఈ విషయాన్ని నలుగురికీ చెబుతూ కేసీఆర్ ఇచ్చిన భరోసాను చిరంజీవి అందరికీ అధికారికంగా తెలపడం ద్వారా నిరాశలో కూరుకుపోయిన సినీ కార్మికుల మనసులను తేలికపరిచే ప్రయత్నం చేశారు. మొత్తానికి జూన్ చివరి నాటికి మొత్తం సెట్టయ్యేలా కనిపిస్తోంది.