Begin typing your search above and press return to search.

మహేష్ డేట్ ఖబ్జా చేసిన మెగాస్టార్‌

By:  Tupaki Desk   |   16 Jan 2022 7:19 AM GMT
మహేష్ డేట్ ఖబ్జా చేసిన మెగాస్టార్‌
X
కరోనా థర్డ్ వేవ్‌ తో మళ్లీ సినిమాల విడుదల తేదీల విషయంలో గందరగోళ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.. ఆ సినిమాలు ఎప్పటికి విడుదల అవుతాయో క్లారిటీ లేదు. ఇక ఫిబ్రవరిలో ఆరు ఏడు పెద్ద చిన్న సినిమాలు విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే ఫిబ్రవరిలో సినిమాల విడుదలకు కరోనా అనుకూలించే అవకాశం లేదు. మార్చి వరకు కరోనా థర్డ్‌ వేవ్‌ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దాంతో ఫిబ్రవరి సినిమా లు కూడా రీ షెడ్యూల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల అవ్వాల్సిన ఆచార్య సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీ విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆచార్య ను ఏప్రిల్‌ 1వ తారీకున విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్‌ 1వ తేదీన మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కాని ఇప్పుడు షూటింగ్‌ పూర్తి అవ్వక పోవడంతో పాటు ఇతర కారణాల వల్ల ఆ సినిమా ఏప్రిల్‌ 1వ తారీకున రావడం సాధ్యం కాదని భావిస్తున్నారు. ఈ సమయంలో ఆ తేదీలో ఆచార్యను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు రావడంతో మహేష్ బాబు మూవీ మళ్లీ వాయిదా పడ్డట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆచార్య సినిమా మాత్రమే కాకుండా భీమ్లా నాయక్ ను కూడా రీ షెడ్యూల్‌ చేయడం జరిగింది. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌ మూడవ లేదా నాల్గవ వారంలో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆచార్య సినిమా కు కనీసం రెండు వారాల ముందు లేదా వెనుక అన్నట్లుగా భీమ్లా నాయక్ విడుదల ఉంటే బాగుంటుందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌ బాబు సర్కారు వారి పాట దసరా వరకు విడుదల అవుతుందో లేదా ఆ తర్వాతే విడుదల అవుతుందో చూడాలి. ఫిబ్రవరిలో విడుదల అవ్వాల్సిన సినిమాలన్నీ కూడా ఏప్రిల్‌ లేదా మే నెలల్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ సినిమా లు మొత్తం థర్డ్‌ వేవ్‌ పూర్తి అయ్యి దేశం మొత్తం థియేటర్లు ఫుల్ రన్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.