Begin typing your search above and press return to search.

మెగా అల్లుడి కోసం 'చిరు' ప్రయత్నాలు నిజమేనా..?

By:  Tupaki Desk   |   9 April 2020 2:30 AM GMT
మెగా అల్లుడి కోసం చిరు ప్రయత్నాలు నిజమేనా..?
X
మెగాస్టార్‌ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇప్పటికే ఆ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలయ్యారు. వారసత్వంగా చాలా మంది హీరోలయినా కానీ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది సక్సెస్‌ఫుల్‌ హీరోలు మరే ఫ్యామిలీ లోను లేరనే చెప్పాలి. లేటెస్టు గా వచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి అందరూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా మీతో పాటే అంటూ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడు. అయితే మెగా అల్లుడు మాత్రం వీళ్ళ దారిలో నడవలేక పోతున్నాడు. అందుకే ఇప్పుడు మెగాస్టార్ తన అల్లుడి కోసం స్వయంగా రంగంలోకి దిగాడట. మాములుగా మెగా హీరోల అందరి సినిమాల కథల విషయంలో కల్పించుకొనే చిరు ఇప్పుడు అల్లుడి కోసం మంచి డైరెక్టర్ ని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడట.

చిరంజీవి అల్లుడిగా, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో కళ్యాణ్ దేవ్. 'విజేత' సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా పర్వాలేదు అనిపించుకున్నాడు. కళ్యాణ్ దేవ్ తన రెండవ చిత్రంగా 'సూపర్ మచ్చి' చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలావుండగానే కళ్యాణ్ మరో చిత్రాన్నీ లైన్ లో పెట్టాడు. శ్రీధర్ సీపాన దర్శకత్వం లో ఒక సినిమాకి కమిట్ అయినట్లు ప్రకటించాడు. టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జిఎటూ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఈ ప్రాజెక్టుల్లో ఒకటి వర్క్ అవుట్ కాదని పక్కన పెట్టేయమని చెప్పాడట.

అంతేకాకుండా అల్లుడి సినీ కెరీర్ గాడిలో పెట్టడానికి స్వయంగా రంగంలోకి దిగి కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ మారుతిని సంప్రదించాడట. మారుతీని తన అల్లుడి కోసం మంచి కామెడీ నేపథ్యంలో స్క్రిప్ట్ రెడీ చేయమని అడిగాడట. 'ప్రతిరోజూ పండగే' సినిమాతో మంచి జోష్ మీద ఉన్న మారుతి తన నెక్స్ట్ మూవీ స్టార్ హీరోతో ప్లాన్ చేసుకుంటున్నాడు. అందువల్ల చిరు ఆఫర్ ని మారుతి సున్నితంగా తిరస్కరించాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మారుతి కాకపోతే ఇంకొక డైరెక్టర్.. మొత్తం మీద మెగాస్టార్ అల్లుడి ఫ్యూచర్ కోసం బాగానే ఆలోచిస్తున్నాడట. ఎలాగైనా అల్లుడి కెరీర్ గాడిలో పెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట.