చిరంజీవి నాపై అరిచాడు.. నేను అబ్బాయ్ అంటాను

Wed Jul 21 2021 10:36:57 GMT+0530 (IST)

Chiranjeevi cried on me .. I would say boy

టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవితో పాటు ఇంకా పలువురు సీనియర్ స్టార్ హీరోలు మరియు జూనియర్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కెరీర్ మొత్తం చాలా ఉల్లాసంగా గడిచిందని.. ప్రతి ఒక్క స్టార్ కూడా తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో చాలా మందిని నేను వరుసలు పెట్టి అంటే బావ.. మరిది.. మామయ్య అంటూ పిలుస్తాను అని చెప్పుకొచ్చారు. చిరంజీవి మరియు బాలకృష్ణలతో ఎన్నో సినిమాల్లో కలిసి నటించే అవకాశం వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. చిరంజీవి తో ఒక సినిమా చేస్తున్న సమయంలో షూటింగ్ సమయంలో అరిచారు అంటూ అన్నపూర్ణ పేర్కొన్నారు.

కొన్ని సార్లు షూటింగ్ సమయంలో డైలాగ్ లు గుర్తు పెట్టుకుంటూ యాక్షన్ కు సిద్దం అయ్యే కంగారులో ఉంటాం. అలా ఒక సినిమా షూటింగ్ సందర్బంగా చిరంజీవి తో పాటు షూట్ లో ఉన్నాను. చిరంజీవి నువ్వు లైట్ చూసుకోవా అన్నాడు. నేను ఆ సమయంలో నీడలో నిలబడి ఉన్నాను చీకటిగా కనిపించడంతో ఆయన నా మంచి కోరే అలా అన్నాడు. నువ్వు ఉన్నావు కదా అందుకే అలా పక్కకు ఉన్నాను అన్నట్లుగా నేను అన్నాను. నేను ఉంటే నువ్వు లైట్ చూసుకోకుండా పక్కకు నిలబడుతావా అన్నట్లుగా చిరంజీవి అన్నారని.. నేను నాకు తెలియలేదులే అబ్బాయ్ చికట్లో నిలబడ్డానా మరి ఎక్కడ నిలబడను అన్నాను అంటూ అన్నపూర్ణ అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.

చిరంజీవిని ఎప్పుడైనా అబ్బాయి అంటాను.. బాలకృష్ణ ను మాత్రం బాల బాబు అని పిలుస్తాను. కృష్ణ గారిని మాత్రం అబ్బాయి అనను అంది. బాలకృష్ణ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు కొడుకుగా నటించాడు. అందుకే అప్పటి బాలయ్య ఇప్పుడు నాకు కనిపిస్తాడ. అందుకే నేను బాలయ్య ను ఇప్పుడు బాల బాబు అని పిలుస్తాను అంది. ఇండస్ట్రీలో నాకు ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు. వారందరు కూడా ఎంతో సాయంగా నాకు నిలుస్తారు అంది.