చిరు vs బాలయ్య: ఇద్దరిలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజసం చూపిందెవరు?

Tue Jul 05 2022 10:15:58 GMT+0530 (IST)

Chiranjeevi and Balakrishna Salt and Pepper Look

టాలీవుడ్ సూపర్ సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం వారు నటిస్తున్న 'గాడ్ ఫాదర్' 'NBK107' సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ వచ్చిన తర్వాత.. ఇద్దరిలో ఎవరి లుక్ మరియు ఎవరి గెటప్ బాగుందంటూ పోలికలు మొదలయ్యాయి. రెండు సినిమాల పోస్టర్లకు లింక్ పెట్టి నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ''గాడ్ ఫాదర్''. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సోమవారం సాయంత్రం రిలీజ్ చేసిన మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. ఇందులో చిరు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్ గా కుర్చీలో కూర్చొని ఉన్నారు. కాస్త వయసు మీద పడిన వ్యక్తిలా కనిపిస్తున్న చిరంజీవిలో రాజసం ఉట్టి పడుతోంది.

ఇదిలా ఉంటే బాలయ్య హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 వర్కింగ్ టైటిల్ తో ఓ మాస్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ ఫస్ట్ లుక్ మరియు టీజర్లను ఇప్పటికే ఆవిష్కరించారు. ఇందులో నటసింహం నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని పంచె కట్టులో ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఈ లుక్ నందమూరి ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే ఇప్పుడు NBK107 మూవీలో బాలయ్య కూర్చీలో కుర్చున్న లుక్ తో.. 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి లుక్ ని కంపేర్ చేస్తున్నారు. సీనియర్ హీరోలిద్దరూ వయసుకు తగ్గట్లుగా సరికొత్త గెటప్స్ లో అలరించారు. వీరిలో ఎవరి స్టైల్ బాగుందని పోల్స్ పెడుతున్నారు. ఇలాంటి లుక్ లో బెస్ట్ అని నందమూరి ఫ్యాన్స్ అంటుంటే.. మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అని మెగా అభిమానులు అంటున్నారు.

నిజానికి బాలయ్య - చిరు ఇద్దరూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్ లో వావ్ అనిపించారు. ఇద్దరూ బ్లాక్ గ్లాసెస్ ధరించి కుర్చీలో రాజసంగా కూర్చున్నారు. రెండు లుక్స్ సిమిలర్ గా ఉన్నప్పటికీ దేవికదే ప్రత్యేకంగా నిలిచింది. ఇలాంటి పోలికలు మానేసి ఇరు వర్గాల ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల గెటప్స్ ను ఆస్వాదించడం మంచిదని న్యూట్రల్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే 'గాడ్ ఫాదర్' మరియు NBK107 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవి 153వ చిత్రాన్ని విజయదశమి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే బాలకృష్ణ 107వ సినిమాని కూడా అదే సీజన్ లో తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఒకవేళ ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్ గ్యారెంటీ అని చెప్పాలి. గతంలో చిరంజీవి - బాలకృష్ణ తమ సినిమాలతో అనేక సార్లు పోటీపడ్డారు. చివరగా 'ఖైదీ నెం.150' - 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలు ఒకరోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి మరోసారి సీనియర్ హీరోలిద్దరూ దసరా పండక్కి బాక్సాఫీస్ బరిలో దిగుతారేమో చూడాలి.