Begin typing your search above and press return to search.

వీడియో: స్విమ్మింగ్ పూల్.. నేచుర్ తో మెగా హోమ్ లుక్

By:  Tupaki Desk   |   2 April 2020 7:50 AM GMT
వీడియో: స్విమ్మింగ్ పూల్.. నేచుర్ తో మెగా హోమ్ లుక్
X
``అంద‌మైన స‌న్ రైజ్... ఉద‌యం లేచాక ఎంత ప్ర‌శాంతంగా ఉందో.. కాలుష్యం లేక సిటీ అందంగా క‌నిపిస్తోంది.. ప‌క్షుల కిల‌కిలా రావాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.. దీనిని బ‌ట్టి చూస్తుంటే మ‌నం ఎంత మిస్స‌యిపోతున్నామో? ఈ దైనందిన జీవితంతో.. మ‌న భూమిని మ‌న‌మే పాడు చేసుకుంటున్నాం. కోరి పోగొట్టుకుంటున్నామ‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా రియ‌లైజ్ కావాలి. నేచుర్ ని కాపాడుకోవాలి`` .. ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో తెలుసా? సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న ఎంత పెద్ద స్టార్ అయినా.. వ్య‌క్తిగ‌తంగా నేచుర్ ని ఎంతగా ప్రేమిస్తారో తెలిసింది త‌క్కువ మందికే. అందుకే ఆయ‌న అభిరుచి మేర‌కు దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్ తో జూబ్లీహిల్స్ (హైద‌రాబాద్) లోని విలాస‌వంత‌మైన సొంత ఇంటిని ఎన్విరాన్ మెంట‌ల్ ఫ్రెండ్లీ ప్లానింగ్ తో నిర్మించుకున్నారు. ఇక ఈ ఇంటి ప్ర‌త్యేక‌త చుట్టూ ప్ర‌కృతి.. ఆహ్లాదంతో ప‌క్షుల కిల‌కిలారావాలు వినిపించ‌డం అనే చెప్పాలి.

ఈ ఇంట్లోనే ఇంత‌కుముందు క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీ జ‌రిగింది. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు ప్రారంభించిన వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ కేంద్రం (ప్ర‌త్యేక నిర్మాణం) లాంచ్ కి టాలీవుడ్ టాప్ స్టార్లు అంతా విజిట్ చేశారు. దాదాపు 25000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఎంతో విశాలంగా నిర్మించిన ఈ ఖ‌రీదైన ఇంటికి సంబంధించిన వీడియోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఇదిగో తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో మెగాస్టార్ త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో రూఫ్ టాప్ పై స్విమ్మింగ్ పూల్ క‌నిపిస్తోంది. ఆ పూల్ మీదుగా న‌గ‌రాన్ని కూడా ఎంతో అందంగా క్యాప్చుర్ చేసారు. ఈ సంద‌ర్భంగా ప‌ర‌వ‌శించిపోతూ మెగాస్టార్ అన్న మాట‌లు ఆస‌క్తిని క‌లిగించాయి.

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో లాక్ డౌన్ మ‌నిషికి ఎన్నో పాఠాలు నేర్పిస్తోంది. ప్ర‌ముఖ సెల‌బ్రిటీలంతా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మెగాస్టార్ చిరంజీవి త‌న ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉన్నారు. వేకువ ఝామును సంధ్యా స‌మ‌యాన్ని ఆయ‌న ఇలా వీడియోలు తీసి అభిమానుల‌కు అందిస్తున్నార‌న్న‌మాట‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌న‌సు ఎంత ఉల్లాసంగా ఉందో ఆ ఇన్ స్టా వీడియోలో గొంతు వింటే అర్థ‌మ‌వుతోంది. నగరం అందంగా.. ప్రశాంతంగా.. కాలుష్య రహితంగా కనిపిస్తోందని.. ప్రకృతిని కాపాడటం మన బాధ్యత అని చిరంజీవి అన్నారు. ద‌టీజ్ మెగాస్టార్ అన్న‌మాట‌. మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల తెర‌కెక్కించ‌నున్న ఆచార్య (మెగాస్టార్ 152) క‌రోనా వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.