సీఎం జగన్ కు థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

Sun May 24 2020 19:54:12 GMT+0530 (IST)

Chiranjeevi Says Thanks To CM YS Jagan

తెలంగాణలో సినిమా షూటింగ్ లకు - పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతులు జారీ కావడంతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలుగు సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు తెలుగు సీని పరిశ్రమకు చెందిన వారంతా ధన్యవాదాలు చెబుతున్నారు. తాజా ముఖ్యమంత్రి కి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేయడంతో ధన్యవాదాలు తెలిరు. ఈ మేరకు ఆదివారం సీఎం జగన్ కు ఫోన్ చేశారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని సీఎం జగన్ చెప్పారని అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని ట్విటర్ లో ఆదివారం చిరంజీవి ప్రకటించారు.కాగా సినీ పరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రముఖులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ భేటీ అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ ను కొనసాగించేలా అనుమతులు తెలంగాణ ప్రభుత్వం దశల వారీగా అనుమతులు ఇస్తామని తెలిపింది. ఇప్పుడు త్వరలోనే ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖులు సమావేశమయ్యే అవకాశం ఉంది.