మరోసారి మాస్టర్ స్టైల్ లో చిరు ?

Wed Jul 17 2019 23:00:01 GMT+0530 (IST)

Chiranjeevi Role Leak In Koratala Siva Movie

సైరా విడుదల కానప్పటికీ చిరంజీవి దీని తర్వాత చేయబోయే 152 సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ జోరుగా సాగుతోంది. కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు దీని మీద రివిజన్ చేస్తూ చిరు సలహాలతో మెరుగు పరిచే పనిలో ఉన్నారట. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అనే క్లారిటీ లేకపోయినప్పటికీ సబ్జెక్టు పరంగా మెగాస్టార్ కొంచెం ఫిట్ గా కనిపించాల్సి రావడంతో ఆ మేరకు వర్క్ అవుట్స్ లో బిజీగా ఉన్నట్టు తెలిసింది.ఇకపోతే దీనికి సంబంధించి ఒక లీక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం చిరు ఇందులో హాకీ కోచ్ గా కనిపిస్తారట. గతంలో ఇలా స్పోర్ట్స్ మెన్ గా స్టూడెంట్ గైడ్ గా కనిపించింది మాస్టర్ లోనే. అంతకు ముందు ఫుట్ బాల్ ప్లేయర్ గా విజేతలో సెంటిమెంట్ తో కన్నీళ్లు పెట్టించారు. ఇందులో కూడా అదే త్వరలో కోచ్ ప్లస్ ఫామిలీ పర్సన్ గా చిరు రోల్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోందట

సాధారణంగా మన హీరోలు స్పోర్ట్స్ కోచ్ లుగా కనిపించేది అరుదు. హిందీలో ఈ ట్రెండ్ రెగ్యులర్ గా ఉంటుంది. తమిళ్ హీరో విజయ్ తో అట్లీ తీస్తున్న బిగిల్ లో కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉండటం గమనార్హం. ఇంతకు మించి చిరు 152 గురించి లీక్ లేదు కానీ డ్యూయల్ రోల్ అనే న్యూస్ అయితే గట్టిగా ప్రచారంలో ఉంది. త్వరలో హీరోయిన్ ఎంపిక పూర్తి చేసి ప్రకటించబోతున్నారు. అనుష్క-నయనతార-ఐశ్వర్యా రాయ్- శృతి హాసన్ అని రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరిని ఫైనల్ చేస్తారో సస్పెన్సు గానే ఉంది. చిరు పుట్టినరోజు ఆగస్ట్ 22 నాడు సైరాతో పాటు ఈ చిరు 152కు సంబంధించిన కీలకమైన అనౌన్స్ మెంట్స్ ఉండొచ్చు