చిరంజీవి - రవితేజ.. క్లాష్ సీన్!

Fri Sep 30 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Chiranjeevi Ravi Teja Clash scene

మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరొకవైపు సెట్స్ పై ఉన్న రెండు సినిమాల షూటింగ్స్ కూడా శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత భోళాశంకర్ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే మరొక సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబి ఎంతో టైం తీసుకుని మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా సిద్ధం చేసిన ఆ కథపై అయితే మెగా అభిమానుల్లో కాస్త అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.ముఖ్యంగా రవితేజ అందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని చెప్పగానే అంచనాల స్థాయి మరింత పెరిగిపోయింది. అయితే రవితేజ అందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయంలో అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారమైతే ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని రవితేజ అరెస్టు చేసే సన్నివేశం కూడా ఉంటుందట. రీసెంట్ గా వైజాగ్ జెట్టిలో నిర్వహించిన ఒక షూట్ లో చిరంజీవితో రవితేజ క్లాష్  సన్నివేశాన్ని చిత్రీకరీంచినట్లు సమాచారం. ఆ విషయాన్ని లోకల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ప్రతిసారి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు.

ఇక ఇప్పుడు కూడా చిరంజీవి సినిమాలో అంతకంటే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి రవితేజ మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయని ఇదివరకే దర్శకుడు చెప్పాడు. ఇక ఇప్పుడు అరెస్టు చేసే సన్నివేశం ఉంటుంది అంటే తప్పకుండా ఫ్యాన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.