Begin typing your search above and press return to search.

కొరటాల గురించి మరో బాంబ్ పేల్చిన చిరంజీవి

By:  Tupaki Desk   |   5 April 2020 10:09 AM GMT
కొరటాల గురించి మరో బాంబ్ పేల్చిన చిరంజీవి
X
టాలీవుడ్ కు పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కష్టకాలంలో సినీ కార్మికులకు పెద్దన్నగా మారారు. లాక్ డౌన్ వేళ సర్వం బంద్ కావడంతో వారిని ఆదుకుంటున్నారు. వారి కోసం చారిటీ సంస్థను స్థాపించి షూటింగ్ లేక ఉపాధి కోల్పోయిన వారికి డబ్బు - నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామాజిక కార్యక్రమాలతోపాటు దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర విషయం చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం చూసి తన కొత్త చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ బంద్ చేద్దామని చెప్పగానే దర్శకుడు కొరటాల ఒప్పుకున్నారని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కొరటాల గురించి చిరంజీవి గొప్పగా చెప్పారు.

కొరటాల శివకు సమాజం పట్ల ఎంతో అవగాహన - మేధస్సు ఉందని చిరంజీవి కొనియాడారు. స్థానిక విషయాలే కాదని.. జాతీయ - అంతర్జాతీయ విషయాలపైన పట్టున్న వ్యక్తి అని కొనియాడారు.

తాను శివలో గమనించిన మరో పాయింట్ ను చిరంజీవి బయట పెట్టాడు. దిగజారుతున్న రాజకీయాలు - నాయకుల నాయకుల వ్యక్తిత్వాలు - ప్రవర్తన గురించి శివ ఎప్పుడూ ఆందోళన చెందుతుంటాడని చెప్పుకొచ్చాడు.

ఇక తనకు పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని.. బిడ్డలు వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తి కొరటాల అని చిరంజీవి ఆకాశానికెత్తేశాడు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం - సామాజిక సృహ ఉన్న వ్యక్తితో సినిమా చేయడం నాకు గర్వంగా ఉందని చిరంజీవి ప్రశంసలు కురిపించారు.