Begin typing your search above and press return to search.

#CHIRU 152 మెగా లుక్ ఇదేనా?

By:  Tupaki Desk   |   15 Dec 2019 6:47 AM GMT
#CHIRU 152 మెగా లుక్ ఇదేనా?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించే 152వ సినిమా ప్ర‌స్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దేవాల‌య భూముల స్కామ్ నేప‌థ్యంలో మాస్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ క‌థాంశాన్ని ఎంచుకుని అన్న‌య్య‌ను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించేందుకు కొర‌టాల ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం వేడెక్కిస్తోంది.

గ‌త కొంత‌కాలంగా మెగా బాస్ లో గ్రేస్ ని పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు తీయ‌డం లేద‌ని అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఖైదీనంబ‌ర్ 150తో స్లిమ్ అయిన చిరు లుక్ ప‌రంగా ఫ‌ర్వాలేద‌నిపించినా.. అప్ప‌టికీ అభిమానులు పూర్తిగా సంతుష్టులు కాలేదు. ఇక ఇటీవ‌లే రిలీజైన సైరా న‌ర‌సింహారెడ్డి హిస్టారిక‌ల్ వారియ‌ర్ క‌థాంశం.. దేశ‌భ‌క్తి నేప‌థ్యం కాబట్టి.. మాసిజానికి ఆస్కారం లేకుండా పోయింది. అందుకే ఇక‌పై తిరిగి మెగా బాస్ ని కొత్త‌గా చూడాల‌న్న పంతం ఫ్యాన్స్ లో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. మెగాస్టార్ సినిమా అంటే ద‌ర్శ‌కుల‌పై ఉండే ఒత్తిడి అసాధార‌ణంగా ఉంటుంది. ప్ర‌స్తుతం కొర‌టాల‌కు అలాంటి స‌న్నివేశ‌మే ఉంది.

కార‌ణం ఏదైనా మెగా బాస్ లుక్ విష‌యంలో కొర‌టాల శివ చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే చిరు రెగ్యుల‌ర్ వ్యాయామంతో ఫిట్ నెస్ ప‌రంగా చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. లుక్ చాలా మారింది. ఈ ఛేంజోవ‌ర్ ఏ స్థాయిలో ఉంది అంటే... ఈయ‌నేనా చ‌ర‌ణ్ కి అన్న‌య్య అన్నంత‌గా మారిపోయారు. లేటెస్టుగా హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో చిరు క‌నిపించిన తీరు అంద‌రికీ షాకిచ్చింది. వైట్ ష‌ర్ట్... స‌న్న‌ని గ‌డ్డం.. పైగా బ్లాక్ గాగుల్స్ లో గ్యాంగ్ లీడ‌ర్ నే త‌ల‌పించారు మెగాబాస్. ఒక ర‌కంగా రౌడీ అల్లుడు.. గ్యాంగ్ లీడ‌ర్ డేస్ ని మెగా బాస్ తిరిగి తెస్తున్నారా? అన్న సందేహం క‌లిగింది. లుక్ ప‌రంగా చూస్తే గ్యాంగ్ లీడ‌ర్ నే త‌ల‌పిస్తున్నార‌న్న చర్చా సాగుతోంది.