Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మరో రీమేక్ పై మనసు పడ్డారా...?

By:  Tupaki Desk   |   17 Oct 2020 2:30 PM GMT
మెగాస్టార్ మరో రీమేక్ పై మనసు పడ్డారా...?
X
టాలీవుడ్ లో ఈ మధ్య రీమేక్‌ సినిమాల హడావిడి కనిపిస్తోంది. ఇతర ఇండస్ట్రీలలో సూపర్ హిట్ అయిన సినిమాల రైట్స్ పోటీపడి మరి తీసుకొని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే అయినప్పటికీ.. గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి రెండు బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ సినిమాలు చేస్తున్నాడనే వార్తలు వస్తుండటంతో రీమేకుల గురించి ఎక్కువగా డిష్కసన్ జరుగుతోంది. 'ఖైదీ నెం. 150' తెలుగు రీమేక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో మలయాళ మోహన్ లాల్ హిట్ సినిమా 'లూసిఫర్' తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ బాధ్యతను మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ కు అప్పగించారు. ఇప్పటికే రచయిత ఆకుల శివ తో కలిసి వినాయక్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌ సమర్పణలో రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

అలానే అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ తమిళ్ సినిమా 'వేదలమ్' ని కూడా మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేయనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నారని సమాచారం. ఈ క్రమంలో చిరు మరో రీమేక్ పై మనసు పడ్డారని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ - గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన 'ఎన్నై అరింధాల్' చిత్రాన్ని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారట. అనుష్క - త్రిష హీరోయిన్లుగా నటించిన సక్సెస్ ఫుల్ ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం నిర్మించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్న ఏఎమ్ రత్నం నుంచి 'ఎన్నై అరింధాల్' రీమేక్ రైట్స్ తీసుకొని హోమ్ బ్యానర్ లో నిర్మించాలని చిరు అనుకుంటున్నారట. అయితే ఈ సినిమా 2015లోనే 'ఎంతవాడు గాని' అనే పేరుతో తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు చూసేసిన చిత్రాన్ని మెగాస్టార్ రీమేక్ చేస్తారా? లేదా ఇవన్నీ ఒట్టి పుకార్లేనా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.