మెగా మనవరాలు సందడి చూశారా

Tue Oct 22 2019 17:20:37 GMT+0530 (IST)

Chiranjeevi Grand Daughter

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు కామా పెట్టి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. 150వ సినిమా - ఖైదీనంబర్ 150.. 151వ సినిమా సైరా నరసింహారెడ్డి రిలీజయ్యాయి. ఈ రెండిటి కోసం మెగాస్టార్ ఎంతగా శ్రమించారో తెరపై ప్రేక్షకులు చూశారు. 60 ప్లస్ ఏజ్ అయినా రీఎంట్రీలోనూ తొలి చిత్ర కథానాయకుడిలా ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో పని చేశారు. ప్రతి సినిమాని మొదటి సినిమాలా ఛాలెంజ్ గా భావించే మెగాస్టార్ స్వభావం అందరికీ అర్థమైంది.ప్రస్తుతం మరో ఐదేళ్ల పాటు క్షణం తీరిక లేనంత షెడ్యూల్ మెగాస్టార్ కి ఉంది. వరుసగా స్టార్ డైరెక్టర్లు.. నవతరం డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. కొరటాల శివతో 152వ సినిమా.. అటుపై పవన్-చరణ్ కాంబినేషన్ లో వేరొక సినిమా చేస్తున్నారు. అయితే ఇంత బిజీలోనూ తీరిక సమయాల్ని మెగాస్టార్ ఎలా స్పెండ్ చేస్తారో తెలియాలంటే ఇదిగో ఈ ఫోటో చూడాల్సిందే.

ఈ ఫోటోలో కనిపిస్తున్నది మెగాస్టార్ చిరంజీవి గారాల మనవరాలు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ దంపతుల కుమార్తె. అప్పుడే ఈ చిన్నారి ఎదిగేస్తోంది. తాతను ఆట పట్టించేంతగా ఎదిగేసింది. మెగాస్టార్ ఒడిలో ఎలా బ్యాక్ ఫీట్ వేసిందో చూశారుగా.. దీనిని బట్టి తాతను సైతం లెక్క చేయని పెంకితనం అల్లరి కనిపిస్తోంది. అఫ్ కోర్స్.. కిడ్స్ అలా ఉంటేనే సరదాగా ఉంటుంది. తాతగారి మోములోని ఆ నవ్వులో అది కాస్తా స్పష్టంగా కనిపిస్తోంది.