Begin typing your search above and press return to search.

'ఆచార్య'లో ఆ పాత్రకి మహేష్ ని అనుకోలేదు

By:  Tupaki Desk   |   5 April 2020 7:27 AM GMT
ఆచార్యలో ఆ పాత్రకి మహేష్ ని అనుకోలేదు
X
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఆచార్య'... మెగాస్టార్ కెరీర్ లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి కాగా కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే కొరటాల శివ ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పినప్పుడే చిత్రంలోని మరో కీలక పాత్ర గురించి స్పెషల్ గా చెప్పాడట. ఈ పాత్రలో మహేష్ నటిస్తున్నారని చాలా కాలం ప్రచారం జరిగింది. ఆయనకు భారీ రెమ్యూనరేషన్ చెల్లించి తీసుకున్నారని అనేక మాధ్యమాలలో ప్రచురించడం జరిగింది కూడా. తర్వాత బడ్జెట్ పరిమితుల వల్ల ఆ పాత్రని మహేష్ చేయడం లేదు - రామ్ చరణ్ ని ఫైనలైజ్ చేసారంటూ మరో న్యూస్ బయటకి వచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించారు.

మెగాస్టార్ మాట్లాడుతూ.. ఫస్ట్ నుండి ఈ మూవీలోని ఓ పాత్ర కోసం కొరటాల చరణ్ నే అనుకుంటున్నారు. అయితే మహేష్ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మహేష్ నాకు బిడ్డతో సమానం - అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశం. కానీ ఈ చిత్రం కోసం మహేష్ ని అసలు అనుకోలేదు. చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కోరిక కూడా చరణ్ ఈ మూవీలో నటించాలని. ఐతే 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. కొరటాల - రాజమౌళి కాంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. ఏదేమైనా రామ్ చరణ్ ఆ పాత్రలో నటించే అవకాశం ఉందనేది మాత్రం దీని ద్వారా క్లారిపై అయ్యిందనే చెప్పాలి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ - రామ్ చరణ్ కొణెదల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.