Begin typing your search above and press return to search.

చెన్నై గొల్ల‌పూడి ఇంటికి బౌతిక ఖాయం

By:  Tupaki Desk   |   14 Dec 2019 3:31 PM GMT
చెన్నై గొల్ల‌పూడి ఇంటికి బౌతిక ఖాయం
X
వెట‌ర‌న్ నటుడు.. రచయిత గొల్లపూడి మారుతీరావు భౌతికకాయాన్ని చెన్నైలోని ఆయ‌న స్వగృహానికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కన్నమ్మపేట దహనవాటికలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే టీన‌గ‌ర్ లో ఆయ‌న నివాసం వ‌ద్ద‌ పార్థీవ దేహాన్ని అభిమానుల సంద‌ర్శ‌నార్థం ఉంచ‌నున్నామ‌ని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అదేరోజు ఉదయం టీనగర్‌ నుంచి అంతిమయాత్ర మొద‌ల‌వుతుంద‌న్నారు.

గొల్ల‌పూడి మ‌ర‌ణ వార్త విని షాక్ కి గురైన వారిలో మెగాస్టార్ చిరంజీవి వంటి ప్ర‌ముఖులు ఉన్నారు. మారుతీరావుతో చిరు త‌న కెరీర్ ఆరంభ రోజుల్లో సాన్నిహిత్యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. చెన్న‌య్ లో గొల్ల‌పూడి ఇంటిని మెగాస్టార్ సంద‌ర్శించి ఆయ‌న భౌతిక కాయానికి నేడు నివాళుల‌ర్పించారు. ఇక ఈ నివాళిలో చిరు కొలీగ్ సుహాసిని స‌హా ప‌లువురు స్టార్లు ఉన్నారు.

కొన్నాళ్లుగా చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొల్ల‌పూడి ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ ఆదివారం ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన మారుతీరావు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన `ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య` చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 280 సినిమాల్లో నటించారు. నాట‌క ర‌చ‌యిత‌గా సాహితీవేత్త‌గానూ గొల్ల‌పూడి సుప‌రిచితం. డాక్టర్‌ చక్రవర్తి సినిమాతో రచయితగా సినీలోకానికి సుప‌రిచితం అయ్యారు. న‌టుడిగా ఎంతో విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుని గొల్ల‌పూడి త‌న‌దైన ముద్ర‌ను వేశారు.