Begin typing your search above and press return to search.

#24/7 మెగా సేవ‌: మిడ్ నైట్ లో లాయ‌ర్ ని కాపాడారు

By:  Tupaki Desk   |   9 Jun 2021 2:30 AM GMT
#24/7 మెగా సేవ‌: మిడ్ నైట్ లో లాయ‌ర్ ని కాపాడారు
X
ప్రాణం ఎంత‌ విలువైన‌దో ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో తెలిసొస్తోంది. సెకండ్ వేవ్ లో మ‌హ‌మ్మారీ ప్రాణాంత‌కంగా మారింది. ఈ విల‌యాన్ని త‌ట్టుకునేందుకు ఆక్సిజ‌న్ అవ‌స‌రం పెద్ద ఎత్తున క‌నిపించింది. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సొంత ఖ‌ర్చుల‌తో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అభిమాన సంఘాల ద్వారా 24/7 ఉచితంగా వాటిని క‌రోనా రోగుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌ష్టంలో మెగా సాయం - సేవ ఎప్పుడూ ఉంటుంద‌ని చిరు-చ‌ర‌ణ్ బృందం నిరూపిస్తున్నారు. ఈ మ‌హా య‌జ్ఞం కోసం ఏకంగా 30కోట్లు ఖర్చు చేశార‌ని తెలుస్తోంది.

ఆక్సిజ‌న్ సాయం ఎంత‌గా సాగుతోంది? ఎంద‌రి ప్రాణాల్ని కాపాడుతోంది? అనేదానికి తాజాగా ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఇటీవల రాజాం ప్రాంతంలో కరోనా సోకిన ఓ న్యాయవాదికి మిడ్ నైట్ లో ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మైంది. అప్ప‌టికే ఉన్న సిలిండ‌ర్ అయిపోగానే వెంట‌నే రీప్లేస్ చేసేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ని సంప్ర‌దించార‌ట‌. అయితే అంత‌ అర్థ‌రాత్రి అప‌రాత్రి అనే భావ‌న లేకుండా ట్ర‌స్ట్ సేవికులు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ని హుటాహుటీన అందించి మాన‌వ‌త‌ను చాటుకున్నారు.

త‌క్ష‌ణం ప్రాణం పోసారంటూ చిరంజీవి ట్ర‌స్ట్ పై లాయ‌ర్ గారి బంధుమిత్రులు కుటుంబీకులు ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం- రాజాం ప‌రిస‌రాల్లో చిరంజీవి ట్ర‌స్ట్ పాపులారిటీ అమాంతం పెరిగింది. ఏ చోట జ‌నం గుమిగూడినా దీనిగురించే చ‌ర్చించుకోవ‌డం చూస్తుంటే మెగా సేవ ఎంత‌గా ఆదుకుంటోందో అర్థ‌మ‌వుతోంది. చిరు త‌ల‌పెట్టిన ఈ మ‌హ‌త్త‌ర కార్యం ఎంద‌రినో కాపాడుతోంది. ప్రాణ‌భిక్ష పెడుతోంది. హ్యాట్సాఫ్ టు మెగాస్టార్ ..