Begin typing your search above and press return to search.

ఆ తేది దాటిదే ఇక దసరాకే

By:  Tupaki Desk   |   28 Jan 2020 3:30 PM GMT
ఆ తేది దాటిదే ఇక దసరాకే
X
'సైరా నరసింహా రెడ్డి' తో తన డ్రీం తీర్చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు కొరటాల శివతో ఓ సందేశంతో కమర్షియల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయాలు వాటిపై జరిగే అన్యాయాలతో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కొంత షూట్ పూర్తయింది. కోకాపేట్ లో ఎప్పటికప్పుడు కొన్ని సీన్స్ తీస్తూ ఓ షెడ్యుల్ ఫినిష్ చేసారు యూనిట్.

త్వరలోనే అవుట్ డోర్ లో మరో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యుల్ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి జెట్ స్పీడ్ లో షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇటివలే 'సరిలేరు' ఈవెంట్ లో వేదికపైనే కొరటాలతో ప్రామిస్ చేయించారు చిరు. వంద రోజుల్లోపే సినిమాను కంప్లీట్ చేస్తానని కొరటాల కూడా అందరి ముందు కమిట్ అయ్యాడు.

పైగా ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని వీలున్నంత  స్పీడ్ గా సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల. ఒక వేళ షూట్ ఏమాత్రం లేటయినా రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్ట్ మిస్ అయితే మళ్ళీ దసరాకి రావాల్సి ఉంటుంది. మరి అనుకున్న సమయానికే పూర్తిచేసి స్వాతంత్రదినోత్సవం సందర్భంగా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తారా చూడాలి.