Begin typing your search above and press return to search.

బూతులు తిడుతున్నారు.. ప్రతీ మహిళా అలాంటిదేనా?: చిన్మయి

By:  Tupaki Desk   |   30 May 2020 10:50 AM GMT
బూతులు తిడుతున్నారు.. ప్రతీ మహిళా అలాంటిదేనా?: చిన్మయి
X
గాయనిగా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా సుపరిచితమైన చిన్మయి వివాదాలకు పెట్టింది పేరు. కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద పోరాటమే చేస్తోంది. బాధితుల గొంతుకై నిలుస్తోంది. మీటూ పేరిట యుద్ధం చేస్తోంది. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు, రాధారవి వంటి వారితో ఢీకొంటోంది.

వైరముత్తు ఎంతో మందిని వేధించాడని.. తనతో కూడా అలాగే ప్రవర్తించాడని చిన్మయి సంచలన వ్యాఖ్యలు కోలీవుడ్ ను ఊపు ఊపేశాయి. చిన్మయిని కోలీవుడ్ డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించి కోర్టు కేసులు పెట్టినా ఆమె బెదరలేదు.

మహిళల తరుఫున పోరాడుతున్న ఆమెను కొందరు సోషల్ మీడియా సాక్షిగా బండ బూతులు తిడుతున్నారు. ఇటీవలే పూజాహెగ్డే-సమంత వివాదంలోనూ ఆమె సమంతకు మద్దతుగా నిలిచి తిట్టి పోసింది. దీంతో చిన్మయిని బూతులు తిడుతూ మెసేజ్ లు పెడుతున్నారట..

‘తప్పు చేస్తే క్షమాపణలు అడగవలసిందే అని నాకు తెలుసు.నన్ను కొందరు ల.ము అని బూతులు తిడుతున్నారు. అసభ్యులకి, మిమ్మిల్ని ఇలా తయారు చేసిన వాల్లకి.. మీ సంస్కారానికి ఓ దండం’ అని చిన్నయి విమర్శించింది.

అయితే చిన్మయికి సపోర్టుగా.. ఎల్.ఎం అంటే లేడి మాఫియా అని కొత్త అర్థాన్ని చెప్పి మద్దతిచ్చారు. దీంతో ఆమె మహిళలందరూ లేడి మాఫియాలే అని చెప్పుకొచ్చింది. కొత్త అర్థాన్ని చెప్పిన నెటిజన్స్ కు ధన్యవాదాలు తెలిపింది. ఆ పదాన్ని అంగీకరిస్తానని పేర్కొంది.