చితక్కొట్టే సినిమాకు టాక్ తేడాగా ఉందే..!

Thu Mar 21 2019 21:53:06 GMT+0530 (IST)

Chikati Gadhilo Chitakkottudu Gets Bad Talk

ఈ మధ్య టాలీవుడ్ లో కొత్తగా ఊపందుకున్న జోనర్ అడల్ట్ కంటెంట్ సినిమాలు.  సాధారణమైన అడల్ట్ కంటెంట్ దశ ఎప్పుడో దాటిపోయాయి ఈ సినిమాలు. పచ్చి బూతు.. మహా బూతు అనే విశేషణాలను వాడితే గానీ ఈ సినిమాలను మనం వర్ణించలేం.  ఈరోజు రిలీజ్ అయిన 'చీకటిగదిలో చితక్కొట్టుడు' అలాంటి సినిమానే.టైటిల్ తోనే బూతు ప్రియుల హృదయాలను చితగ్గొట్టేసిన ఈ చిత్రం ఓ తమిళ సినిమా రీమేక్.  ఉత్త అడల్ట్ జోనర్ కాకుండా హారర్  ప్లస్ అడల్ట్ కామెడీని మిక్సీలో వేసి దానికి ఫుల్ గా మసాలా దట్టించి తీసిన సినిమా. టీజర్.. ట్రైలర్లతో ఎలా ఉంటుందో పూర్తిగా వివరించేసిన ఈ సినిమాకు టాక్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ లో కామెడీ కొంత వర్క్ అవుట్ అయిందనే మాట వినిపిస్తోంది కానీ ఓవరాల్ గా మాత్రం సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చిందని అంటున్నారు.  ఈ సినిమాకు లక్కు ఎలా ఉందంటే అసలు పోటీలో సినిమాలే లేని సీజన్.  ఈ వారంలో రిలీజ్ కావాల్సిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. 'ప్రేమకథా చిత్రమ్-2' సినిమాలు వాయిదా పడడంతో సోలో రిలీజ్ దక్కింది. కళ్యాణ్ రామ్ '118'తప్ప మరో సినిమా పోటీలో లేదు. అది కూడా రిలీజ్ అయి చాలా రోజులు అయింది.  దీంతో స్క్రీన్లు కూడా భారీగా లభించాయి.

అయితే బ్యాడ్ టాక్ వచ్చిన ఈ బూతు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి.  అంతా కుర్రాళ్ళ దయపై ఆధారపడి ఉంది. ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి కమర్షియల్ సక్సెస్ ఫెయిల్యూర్.. గురించి మాట్లాడలేం.  రెండు రోజులు ఆగితే బాక్స్ ఆఫీసును చితక్కొట్టిందా లేదా బాక్స్ ఆఫీస్ చేత చితక్కొట్టించుకోబడిందా అనేది క్లారిటీ వస్తుంది.