ఫస్ట్ లుక్: రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా 'చరిత కామాక్షి'..!

Wed Jul 21 2021 18:00:01 GMT+0530 (IST)

Charita Kamakshi as a romantic intense drama

నవీన్ బేతిగంటి - దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలతో నూతన దర్శకుడు స్త్రీలంక చందు సాయి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''చరిత కామాక్షి''. నవీన్ బేతిగంటి - దివ్య సమర్పణలో ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజనీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'చరిత కామాక్షి' అనే టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా పై ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.''చరిత కామాక్షి'' చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన నవీన్ బేతిగంటి - దివ్య శ్రీపాదలతో పొయెటిక్ ఫీల్ వచ్చేలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని డిజైన్ చేశారు దర్శకులు స్త్రీలంక చందు సాయి. హీరోహీరోయిన్లు ఇద్దరూ ఓ బెడ్ పై వ్యతిరేక దిశలో పడుకొని ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈ పోస్టర్ అనూహ్య స్పందన తెచ్చుకొని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యూత్ ఆడియెన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సంపూర్ణంగా ఆకట్టుకునే రీతిన ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారని నిర్మాత రజనీ రెడ్డి తెలిపారు.

'చరిత కామాక్షి' చిత్రంలో పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అబు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండగా.. రాకీ వనమాలీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కొడటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శివ ఎమ్ఎస్కే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 'చరిత కామాక్షి' సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.