వారం కూడా గ్యాప్ లేకుండా మళ్లీ షూట్ కు చరణ్

Sun Mar 07 2021 15:00:01 GMT+0530 (IST)

Charan to shoot again without a gap even for a week

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. దాదాపు మూడు వారాల పాటు ఆచార్య కు సంబంధించిన కీ షెడ్యూల్ లో పాల్గొన్న చరణ్ ఇటీవలే మేరేడుమిల్లి నుండి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆచార్య కు సంబంధించిన తదుపరి షెడ్యూల్ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా చరణ్ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కు సిద్దం అవుతున్నాడు. ఆచార్య షెడ్యూల్ పూర్తి చేసుకున్న చరణ్ కనీసం వారం కూడా గ్యాప్ లేకుండా ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే జక్కన్న రాజమౌళి భారీ యాక్షన్ సన్నివేశం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ మరియు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను రప్పించాడు.ఆర్ఆర్‌ఆర్ సినిమా లోని ఆ యాక్షన్ షెడ్యూల్ ముగిసిన వెంటనే ఆచార్య చివరి షెడ్యూల్ లో చరణ్ వారం నుండి పది రోజుల వరకు పాల్గొనాల్సి ఉంటుందట. దాంతో ఆచార్య పూర్తి కాబోతుంది. ఆ తర్వాత ఇక పూర్తిగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయ్యే వరకు కంటిన్యూ గా డేట్లు ఇవ్వబోతున్నాడు. వచ్చే నెలతో జక్కన్న షూటింగ్ ను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి చరణ్ ఆచార్య మరియు ఆర్‌ఆర్‌ఆర్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఆచార్య మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఆర్ఆర్‌ఆర్ మూవీ ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమా ల తర్వాత శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో చరణ్ సినిమా చేయబోతున్నాడు.