మేనకోడలితో కలిసి స్టెప్పులేసిన చరణ్...!

Tue Aug 04 2020 13:20:37 GMT+0530 (IST)

Charan steps in with his niece ...!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో ఎక్కువ సమయం కేటాయించడానికి ఇష్టపడతారనే విషయం అందరికి తెలిసిందే. షూటింగ్ కి ఏ మాత్రం గ్యాప్ వచ్చినా తన కుటుంబంతోనే గడుపుతుంటాడు. ఇప్పుడు కరోనా మహమ్మారి పుణ్యమా అని వారితో ఇంకా ఎక్కువ సమయం గడిపే అవకాశం చరణ్ కి లభించింది. ఓ వైపు వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఓ వైపు మెగా కాంపౌండ్ లోని కిడ్స్ తో ఆడుకుంటూ చరణ్ కరోనా డేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల పట్ల చెర్రీ ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారని మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ క్రమంలో లేటెస్టుగా రామ్ చరణ్ ఓ ఆహ్లాదకర వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసారు.కాగా రామ్ చరణ్ ఈ వీడియోలో తన మేనకోడలు నవిష్కతో కలిసి స్టెప్పులేశారు. కళ్యాణ్ దేవ్ - శ్రీజల కూతురు నవిష్కకు టీవీ చూపిస్తూ డాన్స్ చేపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంట్లో చిన్నారి నవిష్క వేసిన క్యూట్ స్టెప్పులు చూడ ముచ్చటగా అందరిని అలరిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ గడ్డం పెంచేసి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. మెగాస్టార్ మనవరాలు నవిష్క ఇలా అందరిని ఆశ్చర్యపరచడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకముందు 'రాములో రాములా' పాటకి డ్యాన్స్ చేసిన వీడియో.. 'ఖైదీ నెం. 150'లోని 'మీమీ' సాంగ్ ని వింటూ అల్లరి చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.