Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ కి ప‌రిణ‌తి అవ‌స‌రం అందుకే బ‌న్నీకి!

By:  Tupaki Desk   |   1 Feb 2023 11:04 AM GMT
చ‌ర‌ణ్ కి ప‌రిణ‌తి అవ‌స‌రం అందుకే బ‌న్నీకి!
X
స్టైలిష్ స్టార్ టర్న్ డ్ ఐకాన్ స్టార్ దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌న‌సుల‌పై చెర‌గ‌ని ముద్ర వేశాడు. మెగావృక్షం నీడ‌లో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు త‌న‌కంటూ ఒక క్రేజ్ ను ఇమేజ్ ని సంపాదించుకున్న‌ అల్లు అర్జున్ అతిపెద్ద‌ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప చిత్రంతో దేశంలోని ప్ర‌జ‌లంద‌రి మ‌న‌సులు దోచాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయులు నివ‌శించే (ఇండియ‌న్ డ‌యాస్పోరా)లో ప్ర‌తిచోటా అసాధార‌ణమైన క్రేజ్ ను సంపాదించిన స్వ‌యంకృషీవ‌లుడు బ‌న్ని. ఇకపై అత‌డు గ్లోబ‌ల్ మార్కెట్ ని ట‌చ్ చేయ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. హిందీ-మ‌ల‌యాళం-త‌మిళం స‌హా అన్ని ద‌క్షిణాది భాష‌ల్లో ఇప్ప‌టికే బ‌న్ని పాపుల‌ర్. అమెరికా -యూకే- ఆస్ట్రేలియా- జ‌పాన్ లోను బ‌న్నీకి ఫాలోవ‌ర్స్ ఉన్నారు. పుష్ప చిత్రాన్ని ర‌ష్యాలోను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే అత‌డు ఇంతింతై అన్న చందంగా ఎద‌గ‌డానికి ముందు తొలిఅడుగు వేసిన సినిమాని ఓమారు గుర్తు చేసుకోవాలి. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసారు. అశ్వ‌నిద‌త్ నిర్మాత‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాతోనే ఆర్తి అగ‌ర్వాల్ చెల్లెలు అతిథి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా పెద్ద విజ‌యం అందుకుంది. అటుపై దేశ‌ముదురు -ఆర్య‌- రేసు గుర్రం-స‌రైనోడు- పుష్ప అంటూ బ‌న్ని అజేయ‌మైన విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు. నేడు దేశంలోని పాన్ ఇండియా స్టార్ల‌లో ఒక‌డిగా వెలుగుతున్నాడు.

నిజానికి గంగోత్రికి అల్లు అర్జున్ మొద‌టి ఛాయిస్ కానే కాదు అనేది కొద్దిమంది స‌న్నిహితుల‌కే తెలిసిన నిజం. తాజాగా ఇంటర్నెట్ లో గంగోత్రి చిత్రానికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు 'గంగోత్రి'ని మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆఫర్ చేశారని తరువాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లో చేరాడ‌ని వెల్లడించారు.

చరణ్ సినీ ఆరంగేట్రం చేయడానికి అప్ప‌టికి చాలా చిన్నపిల్ల‌వాడని భావించి అల్లు అర్జున్ ను ఈ చిత్రానికి సూచించింది చిరంజీవి! అని నాగబాబు తెలిపారు. చరణ్ కి మెచ్యూరిటీ.. అలాగే న‌ట‌శిక్ష‌ణ అవసరమని చిరు అన్నయ్య భావించినందున అల్లు అర్జున్ తో ఈ సినిమా తీయాల‌ని రాఘ‌వేంద్ర‌రావు అండ్ టీమ్ కి స‌ల‌హా ఇచ్చార‌ట‌. అలా చ‌ర‌ణ్ స్థానంలో అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో న‌టించారు. ఆరంగేట్ర‌మే మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని బంప‌ర్ హిట్ చేసారు. పొట్టి నిక్క‌రులో క‌నిపించినా .. మొర‌టోడిగా క‌నిపించినా కానీ..ఆరంగేట్ర‌మే బ‌న్ని న‌ట‌న‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. ఆ త‌ర్వాత ఇంతింతై అన్న చందంగా స్వ‌యంకృషి హార్డ్ వ‌ర్క్ తో నేడు ఈ స్థానానికి ఎదిగాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.