Begin typing your search above and press return to search.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరణ్ ఒక్కడికే ఆ ఘనత దక్కింది..!

By:  Tupaki Desk   |   23 July 2021 2:30 PM GMT
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరణ్ ఒక్కడికే ఆ ఘనత దక్కింది..!
X
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. 'మెగా పవర్ స్టార్' అని పిలుచుకునే స్థాయికి ఎదిగారు. యాక్టింగ్ - ఫైట్స్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీలలో తండ్రి వారసత్వాన్ని పొందిన చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'చిరుత' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, దర్శకధీరుడు రాజమౌళి తో కలిసి 'మగధీర' సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ సాధించాడు. ఆ తర్వాత వచ్చిన 'ఆరెంజ్' 'బ్రూస్లీ' 'జంజీర్' 'గోవిందుడు అందరి వాడే' 'వినయ విధేయ రామ' సినిమాలు నిరాశ పరచగా.. 'రచ్చ' 'నాయక్' 'ఎవడు' చిత్రాలు పర్వాలేదనిపించాయి. 'ధృవ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చెర్రీ.. 'రంగస్థలం' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సినిమా సినిమాకి తన ఇమేజ్ ను మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న చరణ్.. ఇప్పుడు పాన్ ఇండియా పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇద్దరు దిగ్గజ దర్శకులతో వర్క్ చేస్తున్నాడు చెర్రీ.

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో షో మ్యాన్ శంకర్ - దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇద్దరూ దక్షిణాది సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకులు. సౌత్ ఇండస్ట్రీకి పాన్ ఇండియా దారి చూపిన ఫిలిం మేకర్స్. వీరితో కలిసి పని చేయాలని ప్రతీ స్టార్ హీరో కోరుకుంటారు. అందుకే వీళ్ళు డేట్స్ అడిగితే ఇవ్వడానికి భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రెడీగా ఉంటారు. అలాంటి రాజమౌళి - శంకర్ ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్ ఆర్ ఆర్'' చిత్రంలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అవతారంలో చెర్రీ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. చిత్రీకరణ చివరి దశకు వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో వచ్చే పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ని కాపాడుకునే విధంగా రామ్ చరణ్.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీని లైన్ లో పెట్టాడు. '#RC15' చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. ఇదొక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులు - సాంకేతిక నిపుణులను ఎంపిక కూడా జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ - మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా - జానీ మాస్టర్ ఈ సినిమా కోసం వర్క్ చేయనున్నారు. RRR షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే శంకర్ - చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. శంకర్ తో సినిమా చేయాలని ఆశ పడిన చిరంజీవి కోరికను.. ఇప్పుడు తనయుడు నెరవేరుస్తున్నాడని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇలా ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్ద‌రు దిగ్గ‌జ ద‌ర్శ‌కులు శంక‌ర్ - రాజ‌మౌళిల‌తో క‌లిసి ప‌ని చేస్తున్న ఏకైక స్టార్ హీరోగా నిలిచాడు రామ్ చ‌ర‌ణ్. ఈ అవ‌కాశం ఏ స్టార్ హీరోకీ దక్క‌లేదు. ఆ విధంగా చరణ్ కు ఈ ఘనత ద‌క్కింది. 'ఆర్ ఆర్ ఆర్' '#RC15' రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే చరణ్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో తన తండ్రితో కలిసి 'ఆచార్య' సినిమాలో కనిపించనున్నాడు చెర్రీ. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసాడు. దీనికి చరణ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది. అలానే చిరంజీవి తదుపరి చిత్రం 'లూసిఫర్' తెలుగు రీమేక్ నిర్మాణంలో కూడా రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్నారు.