పచ్చబొట్టు రహస్యం చెప్పిన ప్రగతి

Mon Aug 03 2020 11:15:24 GMT+0530 (IST)

Character artist Pragathi tattoo

స్టార్ హీరోల చిత్రాల్లో అమ్మగా అత్తగా నటించి మెప్పించిన ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్న విషయం తెల్సిందే. చిన్న వయస్సులోనే సీనియర్ హీరోలకు కూడా తల్లిగా నటించిన ప్రగతి ఈమద్య సోషల్ మీడియాలో కనిపిస్తున్న తీరు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమాలో చాలా పద్దతిగా కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ గా కనిపిస్తు బాబోయ్ అనిపిస్తుంది. ఈమద్య చేయిపై ఉన్న టాటూ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. తన చేతిపై ఉన్న స్టైలిష్ టాటూ గురించి క్లారిటీ ఇచ్చింది. ఎందుకు ఆ టాటూ వేయించుకోవాల్సి వచ్చిందో చెప్పింది. చిన్న తనంలో తన కుడి బుజం పై టీకా వేయించారు. ఆ టీకా గుర్తు క్లీయర్ గా కనిపిస్తూ ఉన్న కారణంగా దాన్ని కవర్ చేసేందుకు గాను ఇలా టాటూ వేయించి మ్యానేజ్ చేస్తున్నట్లుగా ప్రగతి చెప్పుకొచ్చింది. ఏదో ఒక టాటూ కాకుండా కాస్త స్టైల్ గా ఉండే ఉద్దేశ్యంతో సన్ సింబల్ వేయించానంది.

తన మణికట్టుపై కూడా ఒక టాటూ ఉంది. అది తన క్లోజ్ ఫ్రెండ్స్ జ్ఞాపకార్థం వేయించుకున్నాను అంటూ ప్రగతి చెప్పింది. హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన ప్రగతి తక్కువ సమయంలోనే హీరోయిన్ పాత్రలను వదిలేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది.