Begin typing your search above and press return to search.

బాలయ్య షో లో చంద్రబాబు.. దద్దరిల్లిన సెట్

By:  Tupaki Desk   |   4 Oct 2022 10:10 AM GMT
బాలయ్య షో లో చంద్రబాబు.. దద్దరిల్లిన సెట్
X
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ కి మంచి రెస్పాన్స్ దక్కడంతో ఇప్పుడు సీజన్ 2 తో రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ సీజన్ 2 కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.

మొదటి ఎపిసోడ్ లో బాలయ్య తన బావ అయిన చంద్రబాబు నాయుడును తీసుకు రాబోతున్నాడు అనే విషయం తెల్సిందే. తాజాగా అందుకు సంబంధించిన పిక్ మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమయంలో ఆడియన్స్ చంద్రబాబు నాయుడు సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారని ఆ వీడియోను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.

బాలయ్య యొక్క జోరు చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ నుండి మొదలుకుని కనీసం నాలుగు నెలల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా హాజరు అయ్యారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన విజువల్స్ కానీ స్టిల్స్ కానీ బయటకు రాలేదు. చంద్రబాబు నాయుడుకు సెట్ లోకి ఆహ్వానం పలుకుతున్న బాలయ్య యొక్క ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు తో పాటు లోకేష్ లను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నాడు అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. పెద్ద ఎత్తున ఈ షో యొక్క అంచనాలు ఉన్న కారణంగా మరీ ఆలస్యం చేయకుండా అతి త్వరలోనే ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉంటుందని తెలుస్తోంది. నేడు భారీ ఎత్తున జరుగబోతున్న ఈవెంట్ లో స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.