Begin typing your search above and press return to search.

సమంత కనిపిస్తే 'హాయ్' చెప్పి 'హగ్' ఇస్తానంటున్న చైతన్య..!

By:  Tupaki Desk   |   10 Aug 2022 8:30 AM GMT
సమంత కనిపిస్తే హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటున్న చైతన్య..!
X
అక్కినేని నాగచైతన్య - సమంత జంట విడిపోయి దాదాపు పది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న చై-సామ్.. నాలుగో వివాహ వార్షికోత్సవం జరుపుకోకముందే విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

అప్పటి నుంచి సమంత - చైతన్య ఇద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నారు. కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే విడాకుల ప్రకటన తర్వాత వీరిద్దరూ మళ్లీ కలవలేదు. ఒకవేళ కలిస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు చైతూ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.

నాగచైతన్య ప్రస్తుతం అమీర్ ఖాన్ తో కలిసి చేసిన 'లాల్ సింగ్ చద్దా' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇందులో బోడి బాలరాజు అనే పాత్రలో చై కనిపించనున్నారు. ఇది తనకు డెబ్యూ బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడంతో నార్త్ లో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఇప్పుడు తన మాజీ భార్య సమంత కనిపిస్తే ఏం చేస్తావ్? అనే ప్రశ్నను ఎదుర్కొన్నాడు. దీనికి చై కొంచెం కూడా ఆలోచించకుండా.. ''హాయ్ చెప్పి హగ్ చేసుకుంటాను'' అని సమాధానమిచ్చారు. అయితే సమంతా 'కాఫీ విత్ కరణ్' షోలో దీనికి పూర్తిగా భిన్నంగా మాట్లాడింది.

భర్త అని కరణ్ సంభోదించడానికి కూడా ఇష్టపడని సామ్.. తమ మధ్య పరిస్థితి అంత ఆహ్లాదకరంగా లేదని చెప్పింది. ఇద్దరి మధ్య ఏదైనా కఠినమైన భావాలు ఉన్నాయా? అని అడిగినప్పుడు, 'మీరు మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచినట్లయితే.. మీరు పదునైన వస్తువులను దాచాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి, అలానే ఉంది. కానీ భవిష్యత్తులో మారొచ్చు' అని సమంత చెప్పుకొచ్చింది.

కాగా, 'ఏమాయ చేసావే' సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య - సమంత.. 'ఆటోనగర్ సూర్య' 'మనం' వంటి చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేశారు. పెద్దలను ఒప్పించి 2017 లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ 'మజిలీ' సినిమాలో స్క్రీన్ చేసుకున్నారు. సామ్ నటించిన 'ఓ బేబీ' చిత్రంలో చైతూ గెస్ట్ రోల్ చేశారు.

అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నారు.. అంతా సవ్యంగానే ఉందని అనుకుంటుండగా.. చై సామ్ విడిపోతున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. దీన్ని నిజం చేస్తూ 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి దారిలో వారు ముందుకు సాగుతున్నారు.