అక్కినేని నాగచైతన్య కొత్త గెటప్ దేని కోసం?

Sun Oct 24 2021 19:00:01 GMT+0530 (IST)

Chai new look viral from Bangarraju

నాగచైతన్య అక్కినేని నటించిన `లవ్ స్టోరి` ఘనవిజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. మజిలీ తర్వాత లవ్ స్టోరి అతడికి ఫుల్ కిక్కిచ్చింది. అతను ఇప్పుడు తన తాజా చిత్రం బంగార్రాజు చిత్రీకరణలో ఉన్నాడు.. ఇందులో చైతూ డాడీ నాగార్జున కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని చై లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా లీక్డ్ ఫోటోలో కనిపిస్తున్న చై ప్రింటెడ్ ఫ్లోరల్ షర్టు ధరించి చిన్నపాటి గడ్డంతో కనిపిస్తున్నాడు. నాగార్జున నటించిన హిట్ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ అయిన ఈ చిత్రంలో అతని రూపం ఎలా ఉంటుంది?  ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు? అన్న సస్పెన్స్ అభిమానులను నిలువనీయడం లేదు.

కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే విక్రమ్ కె కుమార్ దర్వకత్వంలో థాంక్యూ అనే మరో చిత్రంలోనూ నాగచైతన్య నటిస్తున్నాడు. అలాగే ఓటీటీల్లో వెబ్ సిరీస్ గురించిన ప్రకటన వెలువడుతుందని కథనాలొస్తున్నాయి.