Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ అమిగోస్.. సెన్సార్ రిపోర్ట్!

By:  Tupaki Desk   |   6 Feb 2023 12:57 PM GMT
కళ్యాణ్ రామ్ అమిగోస్.. సెన్సార్ రిపోర్ట్!
X
నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించగా.. ఆషికా రంగనాథన్ కల్యాణ్ రామ్ సరసన నటించింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుండగా.. అమిగోస్ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. అమిగోస్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే అమ్మేశారని తెలిసింది. వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం.

ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ లో ముగ్గురిలో ఒకరు ఇండియన్ పబ్ లో ఎస్కోబార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అతడిని పోలిన వ్యక్తులు మరో ఇద్దరు ఉంటారు. ఒకరి గాళ్ ఫ్రెండ్ అయితే.. ముగ్గుర్ని చూసి కన్ ఫ్యూజ్ అవుతుంది. ముగ్గురిలో ఒకరు మిగతా ఇద్దరినీ తన ఇంటికి తీసుకు వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది, రాక్షసుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావ్ కదరా అంటూ తండ్రి తిడతాడు. ఆ తర్వాత ఏమైంది, తనలా ఉన్న మరో ఇద్దరినీ ఒకరు ఎందుకు చంపాలని అనుకున్నారు, దాని వెనుక కథేంటో తెలియాలంటే ఈనెల పదో తేదీ వరకు వేచి చూడాల్సిందే.

నేను ఎవరినీ బెదిరించను.. ఐ జస్ట్ కిల్ యూ అని చివరిలో కల్యాణ్ రామ్ చెప్పే డైలాగ్, ముగ్గురిలో మృగం లాంటి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసింది. మనిషిని పోలిన మనుషులు ఎదురు పడితే అరిష్టం అనే డైలాగ్ కథలో ఇంకేదో ఉందనే హింట్ ఇస్తోంది. సోమాలియా కరువు బాధితుడిలా ఆ ఆకలి చూపులు ఏంట్రా తినేస్తావా ఆ పిల్లను అని బ్రహ్మాజీ అడగటం చూస్తుంటే... కామెడీ, రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందని అనిపిస్తోంది.

అంతే కాదండోయ్ ఈ చిత్రంలో బాలయ్య బాబు, దివ్య భారతిపై తెరకెక్కించిన ఎన్నో రాత్రులు వస్తాయి గానీ.. పాటను కల్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా అమిగోస్ కోసం రిమిక్స్ చేశారు. అలాగే మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్.. అమిగోస్ లో రూపురేఖల పరంగా ఒకేలా కనిపించే ముగ్గురు వ్యక్తులుగా కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. వాళ్ల మధ్య స్నేహాన్ని ఆవిష్కరించే యొక యొక పాటను కూడా ఇది వరకే రిలీజ్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.