బాటిల్ క్యాప్ ఛాలెంజ్.. అంతా అదే రచ్చ!

Tue Jul 09 2019 07:00:01 GMT+0530 (IST)

పాత రోత.. కొత్త వింత అనేది పాత సామెత.  అయినా ఇప్పటికీ ఈ ట్రెండుకు తగ్గట్టు సామెత సరిపోతోంది.  ఎన్నో ఛాలెంజులు వచ్చాయి అవన్నీ పాత రోతలు అయ్యాయి. ఇప్పుడు కొత్త వింత మాత్రం 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'.   జూన్ 25 వ తేదీన టేక్వాండో ఇన్ స్ట్రక్టర్ ఫరాబి దావ్లేచిన్ ఈ ట్రెండ్ ను మొదలు పెట్టాడు. ఆయనే కాకుండా బాక్సింగ్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్ మాక్స్ హాలోవే కూడా ఈ బాటిల్ మూత తీసే వీడియోను పోస్ట్ చేయడంతో ఆ వీడియో కూడా ఫేమస్ అయింది. వీళ్ళకు తోడు హాలీవుడ్ యాక్షన్ స్టార్ జేసన్ స్టేథమ్ కూడా కూడా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ను స్లో మోషన్ వీడియోను పోస్ట్ చేశాడు.  ఇక చూసుకోండి.. ప్రపంచం అంతా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ మాయలో పడిపోయింది.. ముఖ్యంగా సెలబ్రిటీలు అందరూ దీన్నో ఉద్యమంలాగా చేపట్టారు. బాలీవుడ్లో ఇప్పటివరకూ దాదాపు పాతికమంది సెలబ్రిటీలు ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ లు పూర్తి చేశారు. అక్షయ్ కుమార్.. టైగర్ చోప్రా.. సుష్మితా సేన్.. శ్రేయాస్ తల్పాడే.. పరిణీతి చోప్రా.. కునాల్ ఖేము.. అదా శర్మ ఇలా చాలామంది ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశారు.

బాలీవుడ్ సెలబ్రిటీలే కాదు.. సాధారణ నెటిజన్లు కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసి తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తున్నారు.  గతంలో ఎన్నో ఛాలెంజ్ లు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ ఛాలెంజ్ వాటన్నిటిని మించి పాపులర్ అయింది. అయితే ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్.. కికీ ఛాలెంజ్ టైపులో డేంజర్ లేదు. ఎవరికీ హానికరం కాదు కాబట్టి  ఇబ్బంది లేదు. ఏదైతేనేం.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.   వీలైతే మీరు ఊ సూపు సూడండే!