Begin typing your search above and press return to search.

రానా పెళ్లిలో స్పెష‌ల్ గెస్టులెవ‌రంటే..!

By:  Tupaki Desk   |   9 Aug 2020 4:34 AM GMT
రానా పెళ్లిలో స్పెష‌ల్ గెస్టులెవ‌రంటే..!
X
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల బృందంలో ఒక నంబ‌ర్ త‌గ్గింది. ఈ లాక్ డౌన్ పీరియ‌డ్ లోనే వ‌రుస‌గా మూడు వికెట్లు ప‌డ్డాయి. నిఖిల్.. నితిన్ .. ఆ త‌ర్వాత రానా .. వీళ్లంతా పెళ్లితో లైఫ్ లో లాక‌య్యారు. దగ్గుబాటి రానా- మిహీక బ‌జాజ్ జంట పెళ్లి రామానాయుడు స్టూడియోస్ లో మ‌హ‌మ్మారీ నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తూ నిన్న సాయంత్రం (8 ఆగస్టు) సింపుల్ గా ది బెస్ట్ గా జ‌రిగింది. గ‌త రాత్రి ఈ పెళ్లి వేడుక‌లో పాల్గొన్న అతిథుల ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.

కోవిడ్ నియ‌మం వ‌ల్ల అతికొద్ది మంది అతిథులు మాత్ర‌మే ఈ వేడుక‌కు ఎటెండ‌య్యారు. వీళ్ల‌లో అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత జంట సంద‌డి అంతా ఇంతా కాదు. బ్ర‌ద‌ర్ రానా పెళ్లి వేడుక ఆద్యంతం క‌జిన్ స‌మంత ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. స‌హ‌జంగానే జెస్సీ అల్ల‌రి గురించి తెలిసిన వారెవ‌రూ త‌న‌ని అంత త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేదు. అంచ‌నాకి త‌గ్గ‌ట్టే సామ్ చిరున‌వ్వుల‌ సంద‌డి ఈవెంట్లో హైలైట్ గా నిలిచింది.

రానా స్నేహితుల్లో ముఖ్యుడైన మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చరణ్... ఉపాసన స‌మేతుడై విచ్చేశారు. ఈ జంట సంద‌డికి సంబంధించిన ఫోటోలు తాజాగా వైర‌ల్ అవుతున్నాయి. అల్లు ఫ్యామిలీ నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇక ఈ వేడుక ఆద్యంతం ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు .. బ‌జాజ్ కుటుంబ స‌భ్యులు అతిథుల‌ కేర్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. బ‌యో సేఫ్టీ అనే కొత్త విధానంలో డి.సురేష్ బాబు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో స్టార్లు మాస్కుల‌తోనూ ద‌ర్శ‌న‌మివ్వ‌డం కొస‌మెరుపు.