మహేష్ తో సెలబ్రిటీ ట్రైనర్ సెల్ఫీ..న్యూ లుక్ ఇదే!

Tue Aug 16 2022 13:02:39 GMT+0530 (IST)

Celebrity trainer selfie with Mahesh

సూపర్ స్టార్ మహేష్ అమెరికా వెకేషన్ పూర్తిచేసుకుని కొన్ని రోజులుగా  హైదరాబాద్ లో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. # ఎస్ ఎంబీ 28వ సినిమా పనుల్లోనే?  మహేష్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ తో డిస్కషన్స్...పాత్రకు తగ్గట్టు  లుక్ పరంగా మార్పులు..శరీరాన్ని మౌల్డ్ చేసుకోవడం ఇవే పనుల్లో మహేష్ బిజీగా ఉన్నారు.ఇప్పటికే మహేష్ లుక్ కి సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో  లుక్ పరంగా పెద్దగా ఛెంజస్ ఏమీ కనిపించలేదు గానీ.. కామన్ గా పలుచని బీయర్డ్ హైలైట్ అయింది. తాజాగా  మహేష్  మిల్కీ వైట్ నడుమ నల్లని..సన్నని గెడ్డం మహేష్ ని కొత్తగా ప్రజెంట్ చేస్తుంది.

బ్రాండెడ్  టీ-షర్ట్.. హ్యాట్ ధరించి సెలబ్రిటీ ఫిటెనెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో కలిసి దిగిన ఓ సెల్పీ ఇప్పుడు మహేష్ అభిమానలుల్లో కాక  పుట్టిస్తుంది.

ఆన్ ది స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్కీన్ అయినా మహేష్ బ్యూటీకి మ్యాకప్ అవసరం లేదని మరోసారి రుజువైంది. మ్యాకప్ వేసుకోకపోయినా...వేసుకున్నట్లే హైలైట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో  అభిమానుల్ని ఖుషీ చేస్తుంది.  మహేస్ స్టన్నింగ్ లుక్ కి ఫ్యాన్స్  ఎగ్జైట్ అవుతున్నారు. సూపర్బ్..మిల్కీబోయ్...అందగాడు అంటూ కామెంట్లు షురూ చేసారు.

గాళ్స్ సైతం మహేష్ అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. నమ్రత చూస్తే కుళ్లుకునేలా కామెంట్లు  కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి బీయర్డ్  లుక్స్ కొన్ని నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అవి లీక్డ్ ఫోటోలు. అధికారికంగా రిలీజ్ చేయలేదు. తాజా సెల్ఫీ మాత్రం అధికారిక లీక్ లా కనిపిస్తుంది.

ఈ కాంబో  త్వరలో సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బంద్ కొనసాగుతోంది. ఆ సంగతేంటో  తేలిన తర్వాత సినిమా షూటింగ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడు మొదలు  పెడదామా? అని మహేష్ సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతున్నారు.