విపత్కర పరిస్థితుల్లో సెలబ్రిటీల విహార యాత్రలు.. బికినీ షోలు నా..?

Thu Apr 22 2021 22:00:01 GMT+0530 (IST)

Celebrity excursions in catastrophic situations

దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగడంతో పాటుగా మరణాలు కూడా  సంభవిస్తున్నాయి. సినీ ప్రముఖులు సైతం మహమ్మారి బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా సకాలంలో ఆక్సిజన్ అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలు ఉన్నప్పుడు కొందరు సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించకుండా.. విహార యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేయడం.. బికినీ ఫోజులు పోస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హీరోయిన్ శృతిహాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. అందరూ విహారయాత్రలకు వెళ్లి హాలిడే ని ఆస్వాదించవచ్చు.. కానీ ఇలాంటి విపత్కర సమయంలో అది సమంజసం కాదని శృతి అభిప్రాయ పడుతోంది. కరోనాతో పోరాడుతున్న వారికి ఇది చాలా కఠినమైన సమయమని.. ప్రజల మనోభావాలను గుర్తించి వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు హాలిడేస్ కు వెళ్లడం కరెక్ట్ కాదని శ్రుతి హసన్ అలాంటి వారిపై సున్నితంగా కామెంట్స్ చేసింది. తన వంతుగా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని షేర్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటానని శృతి ప్రకటించింది. ప్రముఖ రచయిత శోభా దే - బాలీవుడ్ ప్రచారకర్త రోహిణి అయ్యర్ వంటి వారు కూడా సెలబ్రిటీల హోలిడేస్ పై ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.