గంగవ్వ కోసం లంబాడిపల్లికి క్యూ కట్టిన ప్రముఖులు

Sun Oct 18 2020 15:20:29 GMT+0530 (IST)

Celebrities queuing at Lambadipalli for Gangava

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన వారి వెంట మీడియా ఛానెల్స్ మరియు యూట్యూబ్ ఛానల్స్ వెంట పడటం చాలా కామన్ గా జరుగుతూనే ఉంది. ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత వారం పాటు ఇంటర్వ్యూలతో బిజీ బిజీగానే ఉంటారు. అసలే ఈ సీజన్ ప్రత్యేక కంటెస్టెంట్ అవ్వడం వల్ల గంగవ్వకు ఆ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. ఎలిమినేట్ అయిన రెండు రోజులకే ఆమె తన ఊరుకు వెళ్లి పోయింది. హైదరాబాద్ లో ఆమె ఉండగానే ఇంటర్వ్యూల కోసం చాలా మంది ప్రయత్నించారు. కాని ఆమె ఊరు వెళ్లాలనే ఆతృతతో ఎవరికి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. బిగ్ బాస్ బజ్ లో రాహుల్ తో మాట్లాడి ఆ తర్వాత ఇంటికి వెళ్లి పోయింది.గంగవ్వ ఇంటికి వెళ్లినప్పటి నుండి రోజుకు రెండు మూడు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. కుటుంబ సభ్యులతో పూర్తిగా కలవకుండానే సంతోషం అధినేత.. నిర్మాత సురేష్ కొండేటి తన యూట్యూబ్ ఛానెల్ కోసం గంగవ్వను ఇంటర్వ్యూ చేశాడు. గంగవ్వ ఇంటర్వ్యూ కోసం ఆయన లంబాడిపల్లి వెళ్లాడు. గంగవ్వకు ఆయన ఒక చీరను బహూకరించడంతో పాటు చాలా సమయం ఆమెతో ఇంటర్వ్యూ చేశాడు.

సురేష్ కొండేటి మాత్రమే కాకుండా బిత్తిరి సత్తి అలియాస్ రవి కూడా సాక్షి టీవీ ఇంటర్వ్యూ కోసం గంగవ్వను స్వయంగా లంబాడిపల్లి వెళ్లి ఇంటర్వ్యూ చేశాడు. సత్తి ఇంటర్వ్యూ తో పాటు జోర్దార్ సుజాత కూడా గంగవ్వను ఊరు వెళ్లి మరీ ఇంటర్వ్యూ చేసింది. మొత్తానికి గంగవ్వ కోసం పలువురు ఇప్పటికే లంబాడిపల్లి వెళ్లారు. ముందు ముందు మరెంత మంది ముఖ్యులు ప్రముఖులు ఆ పల్లెటూరుకు వెళ్తారో చూడాలి.