ట్రెండ్ సెట్టింగ్ బేబీ బంప్స్!

Thu Jun 13 2019 10:11:21 GMT+0530 (IST)

Celebrities Trend Setting Baby Bumps

మారుతున్న కాలాన్ని బట్టి సోషల్ మీడియా వైరల్ గా మారడంతో ప్రతీదీ ఓ ట్రెండ్ గా మారిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకనర్హం అన్నచందంగా ఉంది సీన్. తాజా ట్రెండ్.. సెలబ్రిటీ బేబీ బంప్!! ఒకప్పటి సెలబ్ వేరు.. ఇప్పటి సెలబ్రిటీ వేరు! సెలబ్రిటీలు పెళ్లై తల్లి కాబోతున్నారంటే ఆ వార్తనే బయటికి పొక్కనిచ్చే వారు కాదు. సీక్రెట్ గా దాచేవారు. కానీ ఇప్పుడలా కాదు కాలంతో పాటే మార్పు. ఇంతకు ముందులా ఎవరు సీక్రసీని మెయింటైన్ చేయడం లేదు. ఎంత బయటికి తెలిస్తే అంతటి ప్రచారం అంటూ..  సోషల్ మీడియాలో ఎంత వైరల్ చేసేస్తున్నారు.బేబీ బంప్ తో పోజులివ్వడానికి మొహమాటం అన్నదే లేకుండా సెలబ్రిటీలు ఏకంగా ట్విట్టర్- ఇన్ స్టాగ్రామ్- ఫేస్ బుక్ ఏ వేదికనీ వదలకుండా తమ బేబీ బంప్ ఫోటోలతో నింపేస్తున్నారు. తల్లి కావడం అనేది ప్రతీ సెలబ్రిటీకి ఓ కల. ఆ ఆనంద క్షణాల్ని తమని అభిమానించే అభిమానులతో పంచుకోవడానికి ఎక్కడా వెనుకాడటం లేదు. జీవితంలో అత్యంత ఆనందకరమైన మధుర క్షణాల్ని ప్రతీ ఒక్కరితోనూ షేర్ చేసుకుంటూ ఆనందాన్ని పొందుతున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గరి నుంచి వివిద దశల్లో వారి బేబీ బంప్ కు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

దీంతో ఇప్పుడిది ట్రెండ్ గా మారిపోయింది. ఇండియాలో తొలుత బాలీవుడ్ ఈ ట్రెండ్ ని క్రియేట్ చేసింది బాలీవుడ్ భామలే. బేబి బంప్ ప్రదర్శించిన కథానాయికల జాబితాని పరిశీలిస్తే చాలానే ఉంది. కొంకణా సేన్ శర్మ-లారా దత్తా- సెలీనా జైట్లీ- జెనీలియా-రాణీముఖర్జీ- ట్వింకిల్ ఖన్నా- మందిరాబేడీ- తారాశర్మ ఐశ్వర్యారాయ్- కాజోల్- శిల్పాశెట్టి- అమృత అరోరా- కరిష్మాకపూర్- మాన్యతా దత్- సమీరారెడ్డి- అమీజాక్సన్. ఇలా చాలా మంది తారలు సోషల్ మీడియాలో తమ బేబీ బంప్ లతో సందడి చేసారు. దానిని ఇరుగు పొరుగు పరిశ్రమల్లో కథానాయికలు అడాప్ట్ చేసుకున్నారు. ఇక నాయికలు తాము పెడుతున్న ఫోటోలపై నెటిజనులు కామెంట్స్ చేస్తున్నా వారికి ధీటుగా సమాధానం చెబుతూ మరిన్ని ఫోటోల్ని పోస్ట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదో రకం ట్రెండ్ అనే చెప్పాలి.