రాకేష్ మాస్టర్ పై కేసు.. మనోభావాలు గాయపరిచాడట!

Tue May 04 2021 15:00:58 GMT+0530 (IST)

Case against Rakesh Master

డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తమ మనోభావాలు గాయపడ్డాయని కొందరు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారట. దీంతో రాకేష్ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు సమాచారం.రాకేష్ మాస్టర్ యూట్యూబ్ చానల్ ద్వారా పలు అంశాలపై మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. శ్రీకృష్ణుడిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారట. దీంతో.. యాదవ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఈ మేరకు.. పోలీసులు 295ఏ 298 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు సమాచారం.

అయితే.. రాకేష్ మాస్టర్ కూడా పలువురిపై అదే బంజారాహిల్స్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. కృష్ణానగర్‌లోని తన ఇంట్లోకి కొందరు అక్రమంగా ప్రవేశించి దుర్భాషలాడారని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో.. పలు సెక్షన్ల కింది నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.