షాకింగ్ః దాసరి కొడుకులపై కేసు.. ఏం చేశారంటే?

Sat Jul 31 2021 13:07:46 GMT+0530 (IST)

Shocking: The case against Dasari's son

దివంగత దర్శక రత్న దాసరి నారాయణ రావు కుమారులపై పోలీసు కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అప్పు తీర్చాలని కోరిన వ్యక్తిని దూషించారని చంపుతామని బెదిరించారని ఓ వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు అనే వ్యక్తి.. నగరంలోని ఎల్లారెడ్డి గూడలో ఉంటున్నారు. ఆయన దాసరి నారాయణరావుతో సన్నిహితంగా ఉండేవారట. దాసరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో సోమశేఖర్ పలు దఫాలుగా అప్పు ఇచ్చారని సమాచారం. ఆ మొత్తం రూ.2 కోట్ల 10 లక్షలు అని తెలుస్తోంది.

అయితే.. దాసరి మరణం తర్వాత ఈ అప్పు విషయం చర్చకు రావడంతో.. పెద్దల సమక్షంలో నిర్ణయాలు జరిగాయని సమాచారం. 2018 నవంబర్ లో మొత్తం 2 కోట్ల 10 లక్షలకు బదులుగా.. ఒక కోటీ 15 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని టాక్. అయితే.. ఆ మొత్తం కూడా ఇప్పటి వరకు చెల్లించలేదట. ఇదే విషయమై అడిగేందుకు వెళ్లిన సోమశేఖర్ రావును.. దాసరి కుమారులు ప్రభు అరుణ్ బెదిరించారని సమాచారం. మళ్లీ డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించారట. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.