#BIGGBOSS5TELUGU E19 : జెస్సీకి కెప్టెన్సీ.. ప్రేమ కథలతో కన్నీళ్లు

Fri Sep 24 2021 10:00:39 GMT+0530 (IST)

Captaincy for Jessie In Bigg Boss Telugu 5

అమెరికా అబ్బాయి.. హైదరాబాద్ అమ్మాయి టాస్క్ ను చాలా ఎంటర్ టైన్మెంట్ తో ముగించిన ఇంటి సభ్యులు ఎవరు ఎలా చేశారు అనుకుంటూ ఉండగా తాజా ఎపిసోడ్ ప్రారంభం అయ్యింది. కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అనే చర్చ కూడా మొదలు అయ్యింది. రవి సీక్రెట్ టాస్క్ లో భాగంగా ప్రియా నక్లెస్ ను దాచి పెట్టి విజయం సాధించాడు. అందుకు గాను రవిని డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీదారుడిగా బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక అమెరికా అబ్బాయి.. హైదరాబాద్ అమ్మాయి.. ఇతర సభ్యుల టీమ్స్ నుండి ముగ్గురిని ఎంపిక చేయాల్సిందిగా బిగ్ బాస్ వారిలో వారికే చెప్పడంతో అమెరికా అబ్బాయి టీమ్ నుండి అందరు కలిసి శ్రీరామ చంద్రను ఎంపిక చేయడం జరిగింది. ఇతరులు టీమ్ నుండి శ్వేత వర్మకు ఛాన్స్ దక్కింది. ఇక హైదరాబాద్ అమ్మాయి నుండి ఎవరు పోటీదారుడు అవుతాడు అనే విషయమై చాలా సమయం చర్చ జరిగింది. చివరకు లహరి మరియు జెస్సీల మద్య పోటీ ఏర్పడింది. ఆ ఇద్దరిలో జెస్సీకి ఈసారి ఛాన్స్ ఇద్దామని రవి చెప్పే ప్రయత్నం చేయడంతో ఇష్టం లేకుండానే లహరి సరే అంటూ అక్కడ నుండి వెళ్లి పోయింది. రవి వల్లే తాను కెప్టెన్సీ కంటెండర్ కాలేక పోయాను అంటూ లహరి బాధ పడింది. మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ కు రవి.. జెస్సీ.. శ్వేత మరియు శ్రీరామ చంద్రలు పోటీ పడ్డారు. ఈ టాస్క్ కు లోబో సంచాలకుడిగా వ్యవహరించడం జరిగింది.కెప్టెన్సీ టాస్క్ ప్రారంభంకు ముందు షణ్ను మరియు సిరిల మద్య చర్చ జరిగింది. అంతకు ముందు రోజు షణ్ను తాను సిరికి దూరంగా ఉండాలి అనుకుంటున్నట్లుగా చెప్పడం జరిగింది. అన్నట్లుగానే సిరికి అతడు కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు. దాంతో సిరికి అర్థం అయ్యి ఎందుకు నన్ను దూరంగా ఉంచుతున్నావు.. నాతో మాట్లాడటం లేదు అంటూ అడిగింది. ఆ సమయంలో షణ్ను కాస్త సీరియస్ గానే ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమెను విడిపించుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు అతడు అన్న మాటతో సిరి బాధ పడి అక్కడ నుండి వెళ్లి పోయింది. సిరి కొద్ది సమయం ఏడ్చింది. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలు అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో ఉన్న అక్షరాలను తీసుకు వచ్చి వారికి కేటాయించిన చోట అమర్చాల్సి ఉంటుంది. అందరిలోకి జెస్సీ ముందుగా ఈ టాస్క్ ను ముగించడంతో మూడవ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా బిగ్ బాస్ జెస్సీని ఆదేశించడం జరిగింది. కెప్టెన్ అయిన తర్వాత పనులు అసైన్ చేస్తూ షణ్ను కు రేషన్ మేనేజర్ పోస్ట్ ను ఇస్తున్నట్లుగా జెస్సీ ప్రకటించాడు. ప్రియాంకను కిచెన్ టీమ్ లో ఉండాలని జెస్సీ విజ్ఞప్తి చేయగా మొదట నో చెప్పినా ఆ తర్వాత ఓకే అంది.

ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు అంతా కూడా తమ మొదటి ప్రేమ గురించి చెప్పాలంటూ సూచించిన సమయంలో ఒకొక్కరుగా వచ్చి తమ ఫస్ట్ లవ్ ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. మొదటగా షణ్ను వచ్చి తన స్కూల్ డేస్ లవ్ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి విషయం తన ప్రస్తుత ప్రియురాలు దీప్తి సునైనకు కూడా తెలుసు అన్నాడు. ఆ తర్వాత సిరి కూడా తన ఫస్ట్ లవ్ ను చెప్పింది. స్కూల్ ఏజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్దం అయితే బయటకు వచ్చేశాను. ఒక స్నేహితుడితో కొన్నాళ్లు కలిసి ఉన్నాను. అతడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. రాత్రి మూడు గంటల సమయంలో నిద్రలో నుండి మెలుకు వచ్చింది. ఏదో అలజడి అనిపించింది.. మళ్లీ పడుకుని లేచేప్పటికి తను చనిపోయాడని.. మూడు గంటల సమయంలో అతడు చనిపోయాడు అంటూ సిరి బోరున ఏడ్చేసింది.

ప్రియా మాట్లాడుతూ తన మొదటి లవ్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యింది. అతడితో నా మొదటి ప్రేమ మొదట బాగానే సాగింది. ఇద్దరం విడిపోయాం.. మా ఇద్దరికి ప్రతిరూపం అన్నట్లుగా నా బిడ్డ అన్నారు. యానీ మాస్టర్ మరియు కాజల్ లు వారి వారి ప్రేమ కథను వివరించారు. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డా ఇప్పుడు మాత్రం తమ చాలా బాగుందని.. తమ జీవితం చాలా సంతోషంగా ఉందని ఇద్దరు పేర్కొన్నారు. విశ్వ మరియు లోబోలు కూడా వారి వారి ప్రేమ కథలు చెప్పి మనసులు చలించేలా చేశారు. మొత్తానికి ఇంటి సభ్యులు అంతా కూడా తమ తమ మొదటి ప్రేమ ను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. సరదాగా సాగిన ఎపిసోడ్ చివర్లో కాస్త ఎమోషనల్ అయ్యింది. తదుపరి ఎపిసోడ్ లో వరస్ట్ ఫెర్ఫార్మర్ మరియు బెస్ట్ ఫెర్ఫార్మర్ ను ఎంపిక చేసే టాస్క్ వచ్చే అవకాశం ఉంది.