Begin typing your search above and press return to search.

అంతూ చూస్తానని బెదిరింపులు.. హీరోపై పోలిస్ కంప్లైంట్

By:  Tupaki Desk   |   11 Aug 2022 12:30 AM GMT
అంతూ చూస్తానని బెదిరింపులు.. హీరోపై పోలిస్ కంప్లైంట్
X
కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపును అందుకున్న దర్శన్ ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. నిర్మాతపై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక ఆడియో టేప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. నిర్మాత అంతు చూస్తాను అంటూ ఎక్కడికి వెళ్లినా కూడా నిన్ను వదిలేది లేదు అంటూ అతను హెచ్చరిక చేయడంతో సదరునిర్మాత పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త కన్నడ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

దర్శన్ పెద్దగా వివాదాల్లో తల దూర్చాడు.. అలాంటిది అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఏమిటి అని అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే దర్శన్ తో సినిమా చేయాలి అని భరత్ అనే ఒక నిర్మాత అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అతనితోపాటు దర్శన్ సమీప బంధువు ధ్రువన్ కూడా సహనిర్మాతగా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ క్రమంలో వీరి కలయికలో శ్రీకృష్ణ పరమాత్మ అనే ప్రాజెక్టును అట్టహాసంగా మొదలుపెట్టారు.

అయితే సినిమా షూటింగ్ కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా భరత్ అనే నిర్మాత పలు ఆర్థిక కారణాల వలన షూటింగ్ చేయలేను అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో ధృవన్ అతనితో మాట్లాడడానికి చాలానే ప్రయత్నాలు చేశాడు. అయితే ఒకరోజు ధ్రువన్, భరత్ మాట్లాడుకుంటూ ఉండగా కాల్ కాన్ఫరెన్స్ లోకి దర్శనం కూడా యాడ్ చేశారు.

అయితే ఆ తరుణంలో భరత్ పై దర్శన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత ఇలాంటి మాటలు నా దగ్గర చెల్లవు అంటూ నీ అంతు చూస్తాను అని అతను హెచ్చరికలు చేసినట్లుగా ఆడియో టేప్ లో వినపడింది.

అంతేకాకుండా ఎక్కడికి వెళ్లినా కూడా నేను వదిలిపెట్టను అని ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అని అతను హెచ్చరిక చేసినట్లుగా సదరు నిర్మాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అయితే దర్శన్ మాత్రం తనపై కావాలని కుట్రలు చేస్తున్నారు అని అందులో ఎలాంటి నిజం లేదు అని స్పందించాడు.